Advertisement
Google Ads BL

మహేష్‌ సీఎం చాంబర్‌కి వస్తున్నాడు...!


'స్పైడర్‌'తో తమ అభిమాన హీరో రికార్డులను బద్దలు కొడుతాడని ఆయన ఫ్యాన్స్‌ ఎంతో ఆశపెట్టుకుంటే వారి ఆశలను మహేష్‌ అడియాశలు చేశాడు. ఇక ఈ చిత్రం విడుదలకు ముందే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' తర్వాత 'భరత్‌ అనే నేను' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని దానయ్య నిర్మిస్తున్నాడు. ఇక ఈ చిత్రం వచ్చే వేసవికి విడుదల కానుంది. దీంతో ఇప్పుడు మహేష్‌ ఫ్యాన్స్‌ ఆశలన్నీ సమ్మర్‌లో వచ్చే 'భరత్‌ అనే నేను' చిత్రంపైనే ఉన్నాయి. ఇక మహేష్‌ ఆల్‌రెడీ 20 రోజుల కిందట అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన అసెంబ్లీ సెట్‌లో చిత్రీకరించిన సీన్స్‌లో నటించాడు. ఆయనతో పాటు పోసాని కృష్ణమురళి, జీవా వంటి వివిధ పార్టీలకు చెందిన శాసనసభ్యులు పాల్గొనగా ఈ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. 

Advertisement
CJ Advs

ఇక అన్నపూర్ణ స్టూడియోస్‌లో షూటింగ్‌ పూర్తి కావడంతో అసెంబ్లీ సెట్‌ని తొలగించారు. కానీ దీనితో ఈ చిత్రంపై పలు సందేహాలతో కూడిన వార్తలు వచ్చేశాయి. మహేష్‌ 'స్పైడర్‌' బాధలో ఉన్నాడని, ఇక తన తదుపరి చిత్రాల విషయంలో మరింత కేర్‌ తీసుకోనున్నాడని, అందుకే ఆయన 'భరత్‌ అనే నేను' చిత్రం షూటింగ్‌ని రద్దు చేసి, సెట్‌ని కూడా తీసేయించాడని బోలెడు వార్తలు హల్‌చల్‌ చేశాయి. ఇక తాజా వార్తతో ఆయన ఫ్యాన్స్‌లో ఓ క్లారిటీ వచ్చింది. త్వరలో మహేష్‌ మరలా ఈ చిత్రం షూటింగ్‌లో జాయిన్‌ కానున్నాడు. ఈ సారి ఆయన కోసం సీఎం చాంబర్‌ సెట్‌ని రెడీ చేస్తున్నారు. సో.. త్వరలోనే భరత్‌ అనే యువ సీఎం, సీఎం చాంబర్‌లో దున్నేయడానికి రెడీ అవుతున్నాడు.

CM Chamber Ready to Mahesh Babu Bharath Anu Nenu:

Bharath Anu Nenu Movie CM Chamber Set Ready
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs