Advertisement
Google Ads BL

మహేష్‌.. మహేష్ అంటే భలే దెబ్బేశాడు?

rakul preet singh,mahesh babu,spyder,brahmotsavam,no importance | మహేష్‌.. మహేష్ అంటే భలే దెబ్బేశాడు?

కొందరికి కొందరు హీరోయిన్స్‌ సెంటిమెంట్‌ ఉంటుంది. మరికొందరికి కొందరు హీరోయిన్స్‌ పేరు వినిపించినా ఆ సినిమా తేడా కొట్టేస్తుంది. ఇక విషయానికి వస్తే మహేష్‌బాబు, శ్రీకాంత్‌ అడ్డాల కాంబినేషన్‌లో పివిపి సంస్థ నిర్మించిన 'బ్రహ్మూెత్సవం' ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. ఈ చిత్రంలోని ముగ్గురు హీరోయిన్లలో మొదట కాజల్‌ అగర్వాల్‌ ప్లేసులో రకుల్‌ప్రీత్‌సింగ్‌ని అనుకున్నారు. కానీ డేట్స్‌ ప్రాబ్లమ్స్‌వల్ల వీలుకాలేదని, దాంతో ఈ చిత్రం ఫ్లాప్‌ నుంచి తనకు వెసులుబాటు లభించిందని రకుల్‌ ప్రీత్‌ సింగే చెప్పింది. 

Advertisement
CJ Advs

ఇక మురుగదాస్‌ దర్శకత్వంలో మహేష్‌బాబు హీరోగా చేస్తున్న 'స్పైడర్‌' లో ఈ అమ్మడికి అవకాశం రావడం, అందునా ఇది తెలుగుతో పాటు తమిళంలో కూడా రూపొందుతున్న చిత్రం కావడంతో ఈ భామ ఎగిరి గంతేసింది. కానీ రిజల్ట్‌ మాత్రం సేమ్‌ టు సేమ్‌. ఇది కూడా డిజాస్టరే. సినిమాపై ఏ అంచనాలు లేని వారు బిలో యావరేజ్‌ అంటూంటే ఫ్యాన్స్‌ మాత్రం డిజాస్టర్‌ అని తేల్చేస్తున్నారు. ఇక ఈ చిత్రం ఫైనాన్షియల్‌పరంగా చూసుకుంటే 'బ్రహ్మూెత్సవం' కంటే భారీ ఫ్లాప్‌గా ట్రేడ్‌ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. 'స్పైడర్‌' బడ్జెట్‌ కంటే 'బ్రహ్మూెత్సవం' బడ్జెట్‌ చాలా తక్కువని, ఇంత పెద్ద బడ్జెట్‌ చిత్రం కావడంతో ఈ 'స్పైడరే' మహేష్‌ కెరీర్‌లో బిగ్‌ డిజాస్టర్‌గా తేల్చేస్తున్నారు. 

అలా రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరు అనుకున్నా, లేక ఆమెను పెట్టుకున్నా మహేష్‌కి దక్కిన ఫలితం మాత్రం ఒకటేనని చెప్పాలి. ఇక 'స్పైడర్‌' డిజాస్టర్‌ వల్ల మహేష్‌ తన తదుపరి ప్రాజెక్ట్‌ల విషయంలో మరింత శ్రద్ద తీసుకుంటున్నాడని అంటున్నారు. ఇక 'స్పైడర్‌' చిత్రం తెలుగు డిజాస్టర్‌ అయినా తమిళంలో ఫర్వాలేదనిపిస్తోంది. దాంతో ప్రస్తుతం రకుల్‌ప్రీత్‌సింగ్‌ కార్తి హీరోగా చేస్తున్న 'ఖాకి' చిత్రంతో పాటు త్వరలో మొదలుకానున్న ఆయన మరో చిత్రంలో, విశాల్‌ హీరోగా రూపొందనున్న చిత్రంలో మాత్రం చాన్స్‌లు కొట్టేసి తన దారి తాను చూసుకుందన్నమాట....! 

No Importance to Rakul Preet Role in Spyder:

Rakul Preet Singh Faced bad Experience with Mahesh Babu
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs