Advertisement
Google Ads BL

పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇంక మారరా..?


ఏ విషయంలోనైనా పవన్ ఫ్యాన్స్ మాత్రం రచ్చ రచ్చ చేసేస్తారు. అల్లు అర్జున్ చెప్పను బ్రదర్ అన్నందుకు ఇప్పటివరకు బన్నీ బాబుతో వారు ఆడుకుంటూనే ఉన్నారు. అలాగే మొన్నటికి మొన్న మహేష్ కత్తి మీద మాటల దాడి మాత్రమే కాదు.... దొరికితే ఇరగదేసేలాంటి రచ్చ జరిగింది. పవన్ కళ్యాణ్ మీద ఉన్న అతి నమ్మకం, అతి అభిమానం ఇవన్నీ పవన్ ఫ్యాన్స్ ని వెర్రివాళ్ళని చేస్తున్నాయి. పవన్ మీద ఈగ వాలితే చాలు ఆ ఈగని వేటాడి వెంటాడి చంపేసేదాకా నిద్ర పోయేలా కనబడం లేదు.

Advertisement
CJ Advs

ఇప్పుడు కూడా తాజాగా పవన్ ఫ్యాన్స్ రచ్చ మాములుగా లేదు. పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ మీద ఒంటికాలుతో లేస్తున్నారు. పాపం తన మనుసులో ఉన్న ఒక విషయాన్ని బయపెట్టినందుకుగాను రేణు మీద ఫైర్ అవుతున్నారు. పవన్ తో విడాకులయ్యాక ఇద్దరు పిల్లలతో ఒంటరి జీవితం కొనసాగిస్తున్న రేణు దేశాయ్ కి ఈ ఒంటరి జీవితంలో తోడేవరన్నా ఉంటె బావుంటుంది అన్న మాటకు పవన్ ఫ్యాన్స్ రెచ్చిపోయి రేణు మీద కయ్యానికి కాలుదువ్వుతున్నారు. పవన్ అన్న భార్య అంటే మాకు వదినతో సమానమని... అలాంటి మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటే మేము చూడలేమంటూ గోల గోల చేస్తున్నారు.

అలాగే పవన్ ని మాజీ భర్త అని సంబోధించినట్టుగా... పవన్ ఫాన్స్ ని తక్కువ చేసి మాట్లాడినట్టుగా రేణు మీద పవన్ ఫాన్స్ ఫైర్ అవుతున్నారు. అసలు రేణు దేశాయ్ నేనలా అనలేదు బాబోయ్ అన్నా వారు వినకుండా రేణుని నానా దుర్భాషాలాడుతూ సోషల్ మీడియాలో రెచ్చిపోతున్నారు. అందుకే రేణుదేశాయ్ నేను ఇచ్చిన స్టేట్మెంట్ లో ఎక్కడా నా మాజీ భర్త అని కానీ.. పవన్ ఫ్యాన్ అనే పదం కానీ వాడలేదని....  నేను చాలా క్లియర్ గా... ఈ పోస్ట్ నా పర్సనల్ ఇష్యూ గురించి కాదు... కేవలం నేను ఈ దేశ పౌరురాలిగా సామాజిక ఆలోచనను మాత్రమే చెప్పాను. మీ అందరికీ అమ్మ.. అక్క.. చెల్లి ఉన్నారు. ఇది నా కోసం కాదు. అంటూ ట్విట్టర్ లో పూర్తిగా క్లారిటీ ఇచ్చింది.

మరి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా ఇంతటి రచ్చ ఎలా చేస్తున్నారు. పవన్ మీద అభిమానం ఉంటే ఉండొచ్చు గాని మరీ.. ఇంత అభిమానం ఉండాలా.. అసలు ఇలా పవన్ ఫ్యాన్స్ చేసే చేష్టల వల్ల.... పవన్ కి ఎంతటి బ్యాడ్ నేమ్ వస్తుందో అని కూడా ఆలోచించడం లేదు. అసలు ఫ్యాన్స్ అనే మాటకు పవన్ ఫ్యాన్స్ అర్హులేనా? అనే అనుమానం అందరిలో వచ్చేసింది. ఇక వీరు మారరు... అని రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు దాదాపు ఫిక్స్ అయ్యారు.

No Change in Pawan Kalyan Fans:

Renu Desai Fires on Pawan Kalyan Fans
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs