Advertisement
Google Ads BL

లావణ్యకి ట్రెడిషనల్ లుక్ తోనే లక్..!


లావణ్య త్రిపాఠికి ప్రస్తుతం చేతిలో హిట్ అనేదే లేకుండా పోయింది. వరసబెట్టి హీరోయిన్ గా చేసిన సినిమాలన్నీ ఫట్ మంటున్నాయి. పద్దతిగా నటించినప్పుడే లావణ్య త్రిపాఠి సినిమాలు కాస్త విజయాన్ని అందుకున్నాయి. ఎప్పుడైతే గ్లామర్ గ్లామర్ అంటూ రాగాలు తియ్యడం మొదలెట్టిందో అప్పటినుండి ఆమెకి విజయాలు వరించడం మానేశాయి. 'మిస్టర్, రాధ, యుద్ధం శరణం' సినిమాల ప్లాప్స్ తో ఉన్న అమ్మడు కొన్ని సినిమాలు కూడా రిజెక్ట్ చేసి బాగా హైలెట్ అయ్యింది. అసలు ఒక దర్శకుడయితే లావణ్య మీద ఉన్న కోపంతో కంప్లైన్ట్ కూడా ఇచ్చాడు.

Advertisement
CJ Advs

ఏది చేసినా కూడా లావణ్యకి లక్కు మాత్రమే కాదు క్రేజ్ కూడా ఏమాత్రం తగ్గడంలేదు. అయితే లావణ్యకు లక్కు అనేది ట్రెడిషనల్ లుక్ లోనే ఉందని... అందుకే లావణ్య రూపం, సౌందర్యం అన్ని అచ్చతెలుగు ఆడపడుచు మాదిరిగా ఉండడంతో.... తాజాగా ఆమెకి ఒక బంపర్ ఆఫర్ దొరికింది. అయితే లావణ్య కి తగిలిన లక్కు సినిమా అవకాశం కాదులెండి. ఒక కంపెనీ వారు లావణ్య త్రిపాఠి ని తమ ప్రొడక్ట్స్ కి బ్రాండ్ అంబాసిడర్ ఎంచుకుంది. ప్రముఖ ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ కి లావణ్య బ్రాండ్ అంబాసిడర్ గా సెలెక్ట్ అయ్యింది.

ఇక బ్రాండ్ అంబాసిడర్ అంటే ఆ ప్రోడక్ట్ కి సంబందించిన యాడ్స్ షూట్స్ అవి ఇవి కూడా ఉంటాయి. ఆయుర్వేదిక్ హెయిర్ ఆయిల్ ప్రొడక్ట్ వారు లావణ్య తో ఆ యాడ్ షూట్ ఇప్పటికే పూర్తి చేశారట. ఆ యాడ్ ని లావణ్య తన సోషల్ మీడియా పేజ్ లో పోస్ట్ చేసింది. అయితే అమ్మడు ఆ యాడ్ లో మాత్రమే ఆ కంపెనీకి బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించడం లేదు.. బయట కూడా తాను ఈ ఆయుర్వేదిక్ ప్రోడక్ట్ ని ఎంతగానో విశ్వసిస్తానని లెక్చర్లు కొడుతోంది.

Lavanya Tripathi Brand Ambassador for Tripura Herbal Hair Oil:

Heroine Lavanya Tripathi Luck Again Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs