Advertisement
Google Ads BL

స్పైడర్ మొదటివారం లెక్కలిలా వున్నాయ్!


రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు స్పైడర్ కోసం ఎదురు చూసినంత సేపు లేదు స్పైడర్ సినిమా విడుదలై నెగెటివ్ టాక్ తెచ్చుకోవడానికి. మురుగదాస్ - మహేష్ కొత్త కలయికలో వచ్చిన స్పైడర్ చిత్రం మురుగదాస్ మార్క్ స్టైల్, మేనరిజం... మహేష్ అందం, స్టైలిష్ లుక్ అన్ని కొత్తగానే ఉంటాయని ప్రేక్షకులంతా ఎక్సపెక్ట్ చేసి మరీ సినిమా హాళ్లకు వెళ్లారు. కానీ అక్కడ మురుగదాస్ స్టైల్ కనబడకపోగా... మహేష్ అందం ఉన్నా... స్పైడర్ లో ఆ పాత్రకున్న ఇంపార్టెన్స్ చూశాక జనాల నోటా మాటరాలేదు. అందుకే స్పైడర్ విడుదలైన మొదటి షోకే సినిమా మీద నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడము... రెండో రోజు ఆ ప్రభావం కలెక్షన్స్ మీద చూపించడం జరిగిపోయాయి. 

Advertisement
CJ Advs

మొదటిరోజు కలెక్షన్స్ ప్రీ బుకింగ్ కారణంగా ఇరగదీసినప్పటికీ రెండో రోజు నెగెటివ్ టాక్ తో డ్రాప్ అయిన కలెక్షన్స్ ... వీకెండ్ లోనూ జోరు చూపించలేక చతికిల పడింది. ఇక స్పైడర్ విడుదల అయిన రెండో రోజే మహానుభావుడు వంటి క్లీన్ ఎంటర్టైనెర్ కూడా థియేటర్స్ లోకి దిగడంతో స్పైడర్ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.  మరి స్పైడర్ మొదటి వారం పూర్తి చేసుకుని రెండో వారంలోకి అడుగుపెట్టింది.  స్పైడర్ మొదటి వారం ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం రెండు తెలుగు రాష్ట్రాలలో కేవలం 31.90  కోట్లు కలెక్ట్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ దెబ్బకి స్పైడర్ ని కొన్న బయ్యర్లు గగ్గోలు పెడుతున్నట్టుగా వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. 

ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏరియాల వారీగా మొదటి వారం స్పైడర్ కలెక్షన్స్ కోట్లలో...

నైజాం:                    9.60 

సీడెడ్:                    4.50 

ఉత్తరాంధ్ర:                3.78 

తూర్పు గోదావరి:         3.66 

పశ్చిమ గోదావరి:         2.72 

గుంటూరు:                3.48 

కృష్ణ:                      2.42  

నెల్లూరు:                  1.74 

టోటల్ ఏపీ, తెలంగాణ కలిపి: 31.90  (కోట్ల షేర్)

Spyder First Week AP and TS Share:

Spyder First Week Collections Revealed
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs