Advertisement
Google Ads BL

ఆ 11 మందిలో ఒక్కరేనా డ్రగ్స్ వాడింది?


మొన్నామధ్యన తెలుగు సినిమా పరిశ్రమని డ్రగ్స్ కేసు ఒక కుదుపు కుదిపిన విషయం తెలిసిందే. డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు 11  మంది సినీ సెలబ్రిటీస్ ని తమ ముందుకు విచారణకు పిలిచి గంటలు గంటలు విచారణ జరిపి రక్త నమూనాలు సేకరించి మరీ పంపడమే కాదు.... ఆ విచారణ పర్వం మొత్తం డ్రామా ఎపిసోడ్ లా ఛానల్స్ కవర్ చేసి మరీ జనాలకు చేరవేశాయి. విచారణ చేసిన సెలబ్రిటీస్ కి శిక్ష వేస్తారా? లేదంటే కేవలం విచారణతోనే సరిపెట్టేస్తారా? అనే విషయానికి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే ఇప్పుడు ఈ డ్రగ్స్ కేసు మళ్ళీ వెలుగులోకొచ్చింది.

Advertisement
CJ Advs

విచారణ చేపట్టిన ఆ 11 మందిలో ఒక వ్యక్తి డ్రగ్స్ తీసుకున్నట్టుగా రుజువైందని... అతను అందరిలా భయపడకుండా సిట్ అధికారులకు బ్లడ్ శాంపిల్స్ ఇవ్వడం ఇక్కడ గమనార్హం. అయితే అక్కడ ధైర్యంగా బ్లడ్ శాంపిల్స్ ఇచ్చి విచారణ ఎదుర్కున్న సదరు వ్యక్తి విచారణ ముగిశాక రెండు మూడు రోజులు కుటుంబంతో కలిసి కూర్చుని మధనపడ్డ తర్వాత మాములుగా షూటింగ్స్ కి వెళ్ళిపోయి డ్రగ్స్ కేసు వ్యవహారాన్ని లైట్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడతను ఇచ్చిన  బ్లడ్ శాంపిల్ రిజల్ట్ వచ్చింది. ఫోరెన్సిక్ ల్యాబ్స్ నుంచి వచ్చిన ఆ బ్లడ్ శాంపిల్ రిపోర్ట్ లో అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా పాజిటివ్ అంటూ బాంబు పేలింది. అయితే ఈ విషయాన్ని అధికారులు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఇలా బయటపెట్టకుండా ఆ బ్లడ్ శాంపిల్ ను సెంట్రల్ ఫోరెన్సిక్ ల్యాబ్ కు కూడా పంపించి సెకండ్ ఒపీనియన్ తీసుకోవాలని నిర్ణయించారట.

అయితే ఆ సెకండ్ ఒపీనియన్ రిజల్ట్ వచ్చేవరకు అతని పేరు బయటికి రాకుండా సిట్ అధికారులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఇక ఆ శాంపిల్ లో కూడా అతను డ్రగ్స్ తీసుకున్నట్టుగా తేలితే.. అతన్ని అరెస్ట్ చేస్తారా? లేదంటే కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారా? అనేది మాత్రం తెలియాల్సి ఉంది. 

Tollywood Drugs Scandal- One Celebrity Suspected:

Drugs Scandal Result- Out of 11 only one Person Suspected
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs