Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ హీరోయిన్ ఆమె కాదంట..!


సాధారణంగా మాటల మాంత్రికుడు, టాప్‌ డైరెక్టర్‌ ఓ చిత్రం పూర్తయితే గానీ మరో చిత్రం గురించి ఆలోచించడు. కనీసం స్టోరీని పాయింట్‌గా అనుకుంటాడే గానీ స్క్రిప్ట్‌ వర్క్‌ని కూడా చేయడు. ప్రస్తుతం త్రివిక్రమ్‌ పవన్‌ నటిస్తున్న పీఎస్‌పీకే 25 చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈచిత్రం వచ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల అని అఫీషియల్‌గా అనౌన్స్‌మెంట్‌ చేశారు. ఇంకా ఈ చిత్రానికి టైటిలే పెట్టలేదు. 

Advertisement
CJ Advs

కానీ ఎన్టీఆర్‌ అభిమానులతో పాటు ఇండస్ట్రీ వర్గాలు అప్పుడే ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో సంక్రాంతికి మొదలై, మార్చి నుంచి సెట్స్‌పైకి వెళ్లనున్న చిత్రంలో ఇలియానా, లేదా 'ఎవడు, ఐ' ప్రస్తుతం రజనీకాంత్‌, అక్షయ్‌కుమార్‌ నటిస్తున్న '2.0'లో నటిస్తున్న అమీజాక్సన్‌ ని ఫైనల్‌ చేశారని వార్తలు వస్తున్నాయి. ఇవి పుకార్లేనని ఎవరికైనా ఇట్టే అర్ధమవుతుంది. త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ తీసే ఫ్యామిలీ ఎమోషన్స్‌, ఇతర ఎమోషన్స్‌లపై ఎక్కువ దృష్టి పెట్టే త్రివిక్రమ్‌ అమీజాక్సన్‌ వంటి హాట్‌భామను పెట్టుకోడని కొందరు వాదిస్తున్నారు. అది ఇప్పుడు నిజమైంది. 

ఈ చిత్రానికి ఆర్టిస్టుల ఎంపిక పవన్‌ కళ్యాణ్‌ చిత్రం తర్వాతనే అని అంటున్నారు. మరోవైపు చిత్ర వర్గాలు పవన్‌తో త్రివిక్రమ్‌ సినిమాలో సెకండ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న అనుఇమ్మానియేల్‌, ఎన్టీఆర్‌ చిత్రంలో నటిస్తోందని వార్తలు వస్తున్నాయి. సాధారణంగా తనకు నచ్చిన హీరోయిన్లతో రెండో చిత్రం చేయడం కూడా త్రివిక్రమ్‌ సెంటిమెంటే. ఇక ప్రస్తుతం అనుఇమ్మానియేల్‌.. అల్లుఅర్జున్‌ హీరోగా స్టార్‌రైటర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంంలో రూపొందుతున్న 'నాపేరు సూర్య.. నా ఇల్లు ఇండియా'లో చేస్తోంది. బహుశా అనుఇమ్మానియేల్‌ వార్త మాత్రం నిజం కానుందనే అంటున్నారు. 

No Amy Jackson in NTR Film :

NTR and Trivikram Srinivas Film Heroine not Finalized
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs