Advertisement
Google Ads BL

శర్వానంద్ నిజంగా మహానుభావుడే!


ఒక్క 'రాధ' తప్ప ఈ మధ్యకాలంలో 'రన్‌రాజారన్‌, ఎక్స్‌ప్రెస్‌రాజా, శతమానం భవతి'లతో పాటు తాజాగా దసరాకు కూడా ఎన్టీఆర్‌ 'జైలవకుశ', మహేష్‌ 'స్పైడర్‌' చిత్రాలతో 'మహానుభావుడు' ద్వారా పోటీపడి విజేతగా నిలిచాడు శర్వానంద్‌. ఆయన గెలుపు నిజమైన గెలుపని అంటున్నారు. ఇక ఈయన 'వెన్నెల, అందరి బంధువయ్యా, ప్రస్థానం' వంటి సీరియస్‌ రోల్స్‌ ప్లే చేస్తున్న అతని కెరీర్‌ని మార్చిన చిత్రం 'రన్‌ రాజా రన్‌'గా చెప్పవచ్చు. ఇక శర్వానంద్‌ విషయానికి వస్తే ఆయన నాని రేంజ్‌లోనే వెళ్తున్నాడు. మరి నాని అంత ఇమేజ్‌ లేకపోయినా ప్రస్తుతం ఆయన ఉన్న స్థితి చూస్తుంటే ఆయన రామ్‌, నితిన్‌, గోపీచంద్‌ వంటి వారిని దాటిపోయాడని అర్ధమవుతోంది. మరి ఇంత క్రేజ్‌ ఉన్న స్టార్‌ ఓ సాధారణ నోకియా ఫోన్‌ వాడుతాడు. 

Advertisement
CJ Advs

నేటిరోజుల్లో చిన్న పిల్లల నుంచి ప్రతి ఒక్కరు స్మార్ట్‌ ఫోన్లు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ వంటి యాప్స్‌ని వాడుతున్న తరుణంలో శర్వానంద్‌ మాత్రం ఇంకా సాధారణ నోకియా ఫోన్‌ని వాడుతున్న విషయాన్ని ఈ 'మహానుబావుడు' ఫోన్‌ని పట్టుకుని ఉన్న ఫొటోని తీసిన సంగీత దర్శకుడు తమన్‌ ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశాడు. శర్వానంద్‌ ఇప్పటికీ సాధారణనోకియా ఫోన్‌ని వాడుతున్నాడు. దానిలో ఎటువంటి యాప్‌లు లేవు. శర్వా నిజంగా 'మహానుబావుడు' అని తమన్‌ ట్వీట్‌ చేయడంతో అందరూ షాక్‌కి గురయ్యారు. ఓ స్టార్‌ హీరో అయి ఉండి ఇంత సింపుల్‌ ఫోన్‌ వాడుతున్నాడా? అని ఆశ్యర్యపోతున్నారు. 

ఎంతైనా ఫోన్‌ లేని, ఈ స్మార్ట్‌ ఫోన్‌లు లేని రోజుల్లో హాయిగా ఉండేవని అనిపిస్తున్న నేపధ్యంలో కేవలం కాల్‌ చేయడానికి, వచ్చిన కాల్‌ని రిసీవ్‌ చేసుకోవడానికి మాత్రం వాడేవారికి ఇలాంటి సాధారణ ఫోన్లు మంచిదని, సోషల్‌మీడియాకు దూరంగా ఎలాంటి హడావుడి చేయకుండా మనసును సోషల్‌ మీడియాకు దూరంగా ఉంచుతున్న శర్వానంద్‌ని మెచ్చుకోకుండా ఉండలేం. 

SS Thaman Interesting Tweet on Sharwanand:

Hero Sharwanand Uses Normal Phone
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs