Advertisement
Google Ads BL

బ్రహ్మానందం టైం మళ్లీ మొదలవుతుందా!


అక్టోబర్ 6న అమెరికాలోని సియాటెల్ నగరంలో జరుగబోవు తస్వీర్ 12వ సౌత్ ఏషియన్ ఫిలిం ఫెస్టివల్ ప్రారంభోత్సవానికి గౌరవ అతిధిగా రెడ్ కార్పెట్ స్వాగతం అందుకోమని ప్రముఖ నటుడు, పద్మశ్రీ  పురస్కార గ్రహీత , వెయ్యి చిత్రాలతో గిన్నిస్ బుక్ లో పేరు నమోదు చేసిన డాక్టర్ బ్రహ్మానందంకి ఆహ్వానం అందింది . ఇదే వేదిక పై అక్టోబర్ 7 న యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ సౌత్ ఏషియా సెంటర్ బ్రహ్మానందంని ఘనంగా సన్మానించనుంది . ఇప్పటి వరకు అంతర్జాతీయ చిత్రోత్సవాల్లో ఈ గౌరవాన్ని పొందిన రెండో నటుడు ఎస్వీ రంగారావు తర్వాత బ్రహ్మానందం మాత్రమే . 

Advertisement
CJ Advs

1964 జకార్తా చిత్రోత్సవాల్లో నర్తన శాల చిత్రానికి గాను ఉత్తమ క్యారెక్టర్ యాక్టర్ గా ఎస్వీఆర్ అవార్డు పొందిన తర్వాత తిరిగి ఇన్నేళ్లకు ఒక తెలుగు నటుడి విశేష ప్రతిభకు అంతర్జాతీయ స్థాయి గుర్తింపు దక్కడం ముదావహం. బాహుబలి తర్వాత ప్రపంచ వ్యాప్తంగా తెలుగు కళాకారుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తోందనడానికి ఇది ఒక ఉదాహరణ . ప్రస్తుతం ఆచారి అమెరికా యాత్ర షూటింగ్ నిమిత్తం అమెరికాలోనే షూటింగ్ లో ఉన్న బ్రహ్మానందం ఈ ఆహ్వానానికి అంగీకారం తెలిపారు. 

నిన్ను కోరి చిత్రం తర్వాత ఆచారి అమెరికా యాత్ర చిత్రానికి అమెరికాలో లైన్ ప్రొడక్షన్ చేస్తున్న పీపుల్ మీడియా సంస్థ అధినేత శ్రీ టీజీ విశ్వ ప్రసాద్ మీడియాకు ఈ వార్త  తెలియజేస్తూ తమ హర్షాన్ని ప్రకటించారు. తెలుగు వాడి పెదవులపై చెరగని చిర్నవ్వు మన బ్రహ్మానందంగారని, ఇటువంటి ఎన్నో అంతర్జాతీయ పురస్కారాలకు వారు అర్హుడని కొనియాడారు. 

Rare Honor to Brahmanandam:

Brahmanandam will be felicitated in America
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs