Advertisement
Google Ads BL

'తొలిప్రేమ' అంటే ఇదేనేమో..!


పవన్‌కళ్యాణ్‌ కెరీర్‌లోనే అత్యంత కీలక చిత్రం 'తొలిప్రేమ'. ఈ చిత్రం పవన్‌కి మంచి స్టార్‌ స్టేటస్‌ని తేవడంతో పాటు యూత్‌, లేడీస్‌లో కూడా మంచి క్రేజ్‌ని తెచ్చింది. ఇక విషయానికి వస్తే యంగ్‌ తరం మెగాఫ్యామిలీ హీరోలైన వరుణ్‌తేజ్‌,మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ కూడా తమ ఇమేజ్‌ కోసం డైరెక్ట్‌గా 'తొలిప్రేమ'ను ఎంచుకుంటున్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాతగా, వరుణ్‌తేజ్‌, రాశిఖన్నా కలిసి నటిస్తున్న చిత్రానికి 'తొలి ప్రేమ' అనే టైటిల్‌ పెట్టారు. ఇక కె.యస్‌.రామారావు నిర్మాతగా 'తొలి ప్రేమ' దర్శకుడు కరుణాకరన్‌ దర్శకత్వంలోనే మరో చిత్రం రూపొందనుంది. ఇది 'తొలిప్రేమ'కు రీమేక్‌ లేదా సీక్వెల్‌ అయ్యే చాన్సుంటుందని దర్శకుడు కరుణాకరన్‌ ఇన్‌డైరెక్ట్‌గా తెలిపాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా 'ఫిదా' చిత్రంతో 50కోట్ల క్లబ్‌లో చేరిన వరుణ్‌తేజ్‌, ఎన్టీఆర్‌ నటించిన 'జై లవకుశ' ద్వారా సంతోషంగా ఉన్న రాశిఖన్నాలు ఈ చిత్రంలో జంటగా నటిస్తున్నారు. ఇక ఈచిత్రం షూటింగ్‌ కొంతకాలంగా లండన్‌లో జరుగుతోంది. దాంతో 'జైలవకుశ' చిత్రాన్ని రాశిఖన్నా కూడా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌తో కలిసి లండన్‌లోనే సినిమాను చూసింది. ఎన్టీఆర్‌ అభిమానులు ఆమెతో కేక్‌ కూడా కట్‌ చేయించారు. సో.. ప్రస్తుతం హిట్స్‌ కొట్టిన వరుణ్‌, రాశిఖన్నాలు లండన్‌ వీధుల్లో కారులో షికారు చేస్తుండగా, ఆ ఫోటోని రాశిఖన్నా ట్విట్టర్‌లో పోస్ట్‌ చేసింది. 

ఈ ఫొటో సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఇందులో వరుణ్‌తేజ్‌ కొత్త హెయిర్‌స్టైల్‌తో, డిఫరెంట్‌ లుక్‌తో ఆకట్టుకుంటున్నాడు. ఇక రాశిఖన్నా విషయానికి వస్తే ఇందులో కూడా ఆమె గ్లామర్‌ రసం నిండిన పాత్రనే చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. ఈ ఫొటోపై రాశిఖన్నా కామెంట్‌ చేస్తూ.. ఈ ఫొటోను చూశారా? శీతాకాలం వల్ల నా కురులు మొహం మీదకి వచ్చి పడుతున్నాయి. శీతాకాలం గాలులకు నా హెయిర్‌ క్లియర్‌గా కంట్రోల్‌ తప్పింది. ఇక వరుణ్‌తేజ్‌ హాయిగా తన ఫొటోలో హాయిగా, నవ్వుతూ ఏదో చూసుకుంటూ ఉన్నాడు. మరి ఫోన్‌లో వరుణ్‌ చూస్తున్నది ఎవరు? ఏమిటి? అంటూ ఆసక్తిగా అభిమానులను ప్రశ్నించింది. మరి ఈ కొత్త 'తొలిప్రేమ' ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది....!

Raashi Khanna Revealed Tholiprema Varun Tej Look:

Tholiprema Varun Tej Look Revealed by Raashi Khanna in twitter 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs