ప్రముఖ వామపక్ష వాది, ఫెమినిస్ట్ అయిన గౌరీలంకేష్ హత్య బెంగుళూరుతో పాటు దేశాన్నంతా ఒక్కసారిగా ఉలిక్కిపడేలా చేశాయి. దాంతో కన్నడతో పాటు దక్షిణాదిలో విలక్షణ నటునిగా పేరున్న ప్రకాష్‌రాజ్ ఈ విషయంలో ప్రధాని మోదీకి లేఖరాసి, ఈ దుశ్చర్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చెప్పకపోతే తనకొచ్చిన జాతీయ అవార్డులను తిరిగి ప్రభుత్వానికి ఇచ్చేస్తానని ప్రకాష్‌రాజ్ మీడియా ముఖంగానే చెప్పాడు.
కానీ ఆయన ఇప్పుడు సడన్‌గా మాటమార్చాడు. ఇవి నేనెంతో కష్టపడి సాధించుకున్న అవార్డ్స్, నన్ను తప్పుగా అర్ధం చేసుకున్నారు. ప్రకాష్‌రాజు తన అవార్డులను తిరిగి ఇచ్చేస్తాడంట అని వార్తలు వచ్చినప్పుడు నవ్వుకున్నాను. నేనంత మూర్ఖుడిని కాదు.. నాపనికి నేను అందుకున్న అవార్డులు ఇవి. అందుకు నేనెంతో గర్వపడుతున్నాను కూడా. అయితే అంత గొప్ప పాత్రికేయురాలు హత్యకు గురైతే ప్రధాని కనీసం నోరు కూడా విప్పకపోవడమే నాకు బాధని, భయాన్ని కలిగిస్తోంది.
నేను ఏ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం లేదు. అయితే ప్రధాని మౌనం మాత్రం నన్ను ఇంకా భయపడేలా చేస్తోంది. ప్రధాని మౌనం గురించి అడిగే హక్కు ఓ పౌరునిగా నాకుంది. కానీ ఆయన మాత్రం మౌనంగానే ఉన్నారు. ఇంత చిన్న విషయానికి ప్రకాష్‌రాజ్ అవార్డులు తిరిగి ఇచ్చేస్తాడనటం నవ్వులాటగా ఉంది. నేను అలా అనలేదు. నా అవార్డులను తిరిగి ఇచ్చే ప్రశ్నేలేదు. నాకు అవార్డులు తిరిగి ఇచ్చేయాలన్న ఆలోచన కూడా తనకు లేదని ఆయన చెప్పడం విశేషం.