పవన్ ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రంలో నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రం షూటింగ్‌ను పూర్తి చేసి పూర్తిస్థాయిలో రాజకీయాలలోకి కూడా వస్తానని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఆయన తన పార్టీ 'జనసేన' వచ్చే ఎన్నికల్లో ప్రత్యక్ష పోరుకు కూడా సిద్దమని చెప్పాడు. ఇక తమ జనసేన పార్టీ వచ్చే ఎన్నికల్లో ఏపీ, తెలంగాణలో కలిపి 175 సీట్లుకు పోటీ చేస్తుందని మన బలం ఎంత ఉందో అదే స్థాయిలో పోటీ చేద్దామని పవన్ చెప్పినట్లు ఆ పార్టీ అఫిషియల్ ట్విట్టర్ ద్వారా పవన్ సందేశాన్ని ఆయన అనుచరులు విడుదల చేశారు.
కానీ ఈ ట్వీట్ వచ్చిన వెంటనే ఎంతో బహిరంగంగా ప్రకటించాల్సిన విషయాన్ని తొందరపడి పవన్ ఎంతో ముందుగానే చెప్పేశాడనే విమర్శలు వస్తున్నాయి. తాము పోటీ చేయబోయే నియోజకవర్గాల విషయంలో ఈ పార్టీ చేసిన ముందస్తు తప్పిదం వల్ల పవన్‌కి, ఆయన పార్టీకి చిక్కులు వచ్చిపడ్డాయి. రాజకీయ వర్గాలలో ఇది చర్చనీయాంశం కావడంతో ఆ ట్వీట్‌ని వెంటనే డిలేట్ చేశారు.
అయితే ట్వీట్‌ని డిలేట్ చేసినా కూడా ఆ విషయంలో వివరణ ఇవ్వక తప్పని పరిస్థితులు పవన్‌కి ఏర్పడ్డాయని అంటున్నారు. తాము ఎన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామనే విషయంలో క్లారిటీ ఇవ్వడం కోసమే పవన్ ఈ ప్రకటన చేసినా కూడా ఇది మరీ చాలా తొందరపాటు నిర్ణయమని, ఎన్నికలకు ఇంకా ఎంతో కాలం సమయం ఉండగా, పవన్ ఇలా ఎందుకు చేశాడు? అనేది చూసిన వారు రాజకీయాలలో అనుభవరాహిత్యం, పిల్ల చేష్టల కింద ఈ ట్వీట్‌ని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.