Advertisement
Google Ads BL

చినికి చినికి గాలివానల మారుతోంది...!


బాలీవుడ్‌ స్టార్‌ హృతిక్‌రోషన్‌, 'క్వీన్‌' కంగనారౌనత్‌లు డర్టీ వ్యవహారం మరోసారి వార్తల్లోకి వచ్చింది. గత ఏడాది ఏప్రిల్‌లో కంగనా మీద తీవ్ర ఆరోపణలు చేస్తూ హృతిక్‌ రోషన్‌ తన లాయర్‌ మహేష్‌ జెఠ్మలానీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులను రిపబ్లిక్‌ టీవీ తిరిగి ప్రస్తావించడంతో ఇప్పుడు అంతా ఆసక్తిని కలిగిస్తోంది. ఈ ఫిర్యాదులో హృతిక్‌, కంగనా రౌనత్‌ మీద తీవ్ర ఆరోపణలు చేశాడు. కంగనా తనను వెంటాడి వేధించిందని, ఆమె నిత్యం తనవెంట పడేదని, కంగనా తనకు సెక్స్‌కి సంబంధించిన మెసేజ్‌లు పెట్టేదని, తనను ఆమె 'శాశ్వత ప్రేమికుడు'గా అభివర్ణించేదని హృతిక్‌ చేసిన ఫిర్యాదులో ఉంది. 

Advertisement
CJ Advs

2009లో 'కైట్స్‌' సమయంలో తాను ఆమెని కలిశానని, 'క్రిష్‌౩' లో కలిసి నటించినా తమ మధ్య స్నేహం లేదని హృతిక్‌ తెలిపాడు. 2009, 2013లో తాను కేవలం వృత్తిపరమైన పనుల కోసమే కంగనాను కలిశానని హృతిక్‌ అంటున్నాడు. 2014లో ఆమె నుండి తనను దూషిస్తూ, అసభ్యకర మెసేజ్‌లు వచ్చేవని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఆమె సోదరి కూడా రంగోళి నుంచి కూడా నాకు మెసేజ్‌లు వచ్చేవని, అందులో ఆమె సోదరి హృతిక్‌ తనను మానసికంగా, భావోద్వేగాల పరంగా రేప్‌ చేశాడని ఆరోపిస్తూ మెసేజ్‌లు వచ్చినట్లు ఆయన పేర్కొన్నాడు. 

ఇటీవల కంగనారౌనత్‌ హృతిక్‌రోషన్‌ని 'సిల్లీ ఎక్స్‌' అని దూషించడంతో మరలా ఈ వివాదం చినికి చినికి లీగల్‌ కేసుదాకా వచ్చింది. తాను నటించిన తాజా చిత్రం 'సిమ్రాన్‌' ప్రమోషన్‌లో భాగంగా ఆమె మరల హృతిక్‌ని టార్గెట్‌ చేసింది. హృతిక్‌ ఫిర్యాదు పాతదేనని, కానీ టీఆర్పీల కోసమే రిప్లబిక్‌ టీవీ దీనిని మరలా ప్రసారం చేసిందని కంగనా లాయర్‌ అంటున్నాడు. కంగనా ఈ వివాదాన్ని దాటి ముందుకు వెళ్లిపోయిందని ఆమె సోదరి రంగోళి వ్యాఖ్యానించింది.ఇకనైనా ఈ అంకుల్‌ తన భార్య పిల్లల మీద తన దృష్టిని నిలపాలని ఆమె సలహా ఇచ్చింది. అయితే హృతిక్‌ రోషన్‌కి ఆల్‌రెడీ పెళ్లి అయి విడిపోయినా కూడా ఆయన మాజీ భార్య నుంచి పలువురు సన్నిహితులు ఇందులో కంగనాది తప్పితే హృతిక్‌ది తప్పేమి లేదంటున్నారు. మరి చివరికి ఈ వివాదం దేనికి దారితీస్తుందో వేచిచూడాల్సివుంది...! 

Hrithik Roshan Reacts on Kangana Ranaut Mails:

Bollywood Hero Hrithik Roshan Revealed Kangana Sexually Explicit Emails
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs