Advertisement
Google Ads BL

వీరిద్దరిలో ఎన్టీఆర్ హీరోయిన్ ఎవరు?


ఎన్టీఆర్ - త్రివిక్రమ్ కలయికలో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకెళుతుందో క్లారిటీ లేదుగాని ఆ సినిమాపై వచ్చే వార్తలు అన్ని ఇన్ని కావు. మొన్నటివరకు త్రివిక్రమ్ సినిమా కోసం ఎన్టీఆర్ స్పెషల్ గా మేకోవర్ అవుతాడనే న్యూస్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. కానీ అదేం లేదంటూ ఎన్టీఆర్ క్లారిటీ ఇచ్చేశాడు. అలాగే ఎన్టీఆర్ సినిమా కోసం త్రివిక్రమ్ అప్పుడే హీరోయిన్ ని సెట్ చేసినట్టుగా...అదికూడా  పవన్ సినిమాలో నటిస్తున్న అను ఇమ్మాన్యువల్ ని ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్ సెట్ చేసేసినట్లు వార్తలొచ్చాయి. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు ఎన్టీఆర్ కోసం త్రివిక్రమ్,అను ని తీసుకోవడంలేదు... ఆమె స్థానంలో 2.0 హీరోయిన్ అమీ జాక్సన్ ని తీసుకుంటున్నట్లుగా సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. అయితే ఎన్టీఆర్ ఫాన్స్ మాత్రం అమ్మో ఎన్టీఆర్ పక్కన అమీనా... అయితే అస్సులు బాగొదంటున్నారు. ఎందుకంటే రామ్ చరణ్ సరసన అమీ జాక్సన్ ఎవడు సినిమాలో నటించింది. ఆమె ఆ సినిమాలో ఫుల్ గ్లామర్ షో అంటే..... బికినీ షో చేసింది. అయితే ఆ సినిమాలో అమీ జాక్సన్ కి పెద్దగా పేరు రాలేదు. ఆ సినిమా కూడా హిట్ అవలేదు. అందుకే కాబోలు ఎన్టీఆర్ ఫాన్స్ అమీ అంటే భయపడుతున్నారు.

అయితే ఎన్టీఆర్ సినిమాలో అమీ అనేది మాత్రం ఒట్టి రూమరే.... గాని నిజం లేదంటున్నారు. అయినా ప్రస్తుతానికి త్రివిక్రమ్ తాను తెరకెక్కిస్తున్న పవన్ సినిమా మీదే ఫోకస్ పెట్టాడు. ప్రస్తుతానికి ఎన్టీఆర్ సినిమా స్క్రిప్ట్ మీద కూర్చునే తీరిక కూడా లేదు. మరి అలాంటప్పుడు ఎన్టీఆర్ సినిమా కోసం అమీ జాక్సన్ ని గాని, అను ఇమ్మాన్యువల్ ని గాని ఎంపిక చేసే తీరిక త్రివిక్రంకి లేదు అంటున్నారు కొందరు. ఇకపోతే ఎన్టీఆర్ - త్రివిక్రమ్ సినిమా వచ్చే ఏడాది మార్చి లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని అంటున్నారు.

Confusion on NTR and Trivikram Srinivas Film Heroine:

Anu Emmanuel or Amy Jackson, Who is NTR Heroine?
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs