సినిమాను ఐసియులో చావుబతుకుల మద్య ఉన్న పేషెంట్‌తో, ప్రేక్షకులను డాక్టర్లతో విశ్లేషకులను దారిన పోయే దానయ్యలతో ఎన్టీఆర్ పోల్చిన వివాదం ఇప్పటికీ ముగియలేదు. ఆయన వ్యాఖ్యలు విశ్లేషకులను తీవ్రంగా హర్ట్ చేశాయి. దాంతో ఈ మద్య ఎన్టీఆర్ ఆ పోలిక తెచ్చిన తర్వాత తమ ఇగోని ఎన్టీఆర్ హర్ట్ చేయడంపై విశ్లేషకులు తీవ్ర ఆగ్రహంగా ఉండటంతో రోజురోజుకి ఎన్టీఆర్‌కి వ్యతిరేకంగా ఓ కథనమైనా వస్తోంది.
దీంతో ఎన్టీఆర్ కాస్త తగ్గి, తాను అందరనీ అనలేదని, కొందరిని మాత్రమే అన్నానని, కాబట్టి ఇకనైనా ఎన్టీఆర్ గురించి నెగటివ్ ఆర్టికల్స్ ఇవ్వడం ఆపాలని, రెండు మూడు రోజుల్లో పత్రికా ముఖంగానే ఎన్టీఆర్ విశ్లేషకులకు క్షమాపణ చెబుతాడని ఎన్టీఆర్ క్యాంపునుంచి వార్తలు వస్తున్నాయి.మొత్తానికి ఎన్టీఆర్ తొందరపడి చేసిన తప్పును ఇకనైనా గుర్తించి, తాను ఎక్కడ, ఏ విధంగా తప్పు చేశానో తెలుసుకుంటే అంతకంటే కావాల్సింది ఏముందని అంటున్నారు.
దీంతో ఇప్పటి నుంచి మీడియా కూడా ఎన్టీఆర్ అంతగా వర్తమానాలు పంపుతుండటంతో ఇక విషయాన్ని తెగేదాకా లాగకుండా ఇక్కడితో ఆపేయాలని విశ్లేషకులు కూడా భావిస్తున్నారు.