యంగ్ రెబెల్‌స్టార్ ప్రభాస్‌కి 'బాహుబలి' తర్వాత హీరోగా విపరీతమైన క్రేజ్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో ఆయన ఇండియన్ నేషనల్‌స్టార్‌గా ఎదిగాడు. బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తోన్న 'సాహో' చిత్రాన్ని తెలుగు, తమిళ, మలయాళ, హిందీ భాషల్లో కూడా తీస్తున్నందున అన్ని భాషల నటీనటులను ఆ సినిమా కోసం ఎంపిక చేస్తున్నారు. నీల్‌నితిన్‌ముఖేష్, జాకీష్రాఫ్, చుంకీపాండేలతో పాటు మెయిన్ విలన్ పాత్రకి నసీరుద్దీషాను ఎంపిక చేశారు. కటౌట్‌కి ప్రభాస్‌కి పోటీ ఇవ్వలేకపోయినా నటనలో మాత్రం ఏ స్టార్‌నైనా డామినేట్ చేయగలిగిన విలక్షణ నటుడు నసీరుద్దీన్ షా.
ఈ విషయంలో యూనిట్ సరైన ప్రతినాయకుడిని వెతికి పట్టుకుందని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఇక్కడే ఒక సమస్య ఎదురవుతోంది. ఈ చిత్రం నిండా పరభాషా నటులను పెడుతూ ఉండటంతో చివరకు తెలుగు ప్రేక్షకులకు ఈచిత్రం లోటు తెచ్చినట్లు అవుతుందా? ఈ ఇతర భాషల నటీనటుల ఫ్లేవర్స్ వల్ల 'సాహో' చిత్రానికి తెలుగు కంటే ఇతర భాషల్లోనే ఎక్కువగాక్రేజ్ వచ్చినా ఆశ్యర్యపడాల్సిన పనిలేదు అని విశ్లేషకులు అంటున్నారు. అయినా తెలుగువారికి ప్రభాస్ ఒక్కడు ఉంటే అదే చాలని మరికొందరు వాదిస్తున్నారు.