Advertisement
Google Ads BL

చైతూ సరసన హీరోయిన్ సెట్టయింది!


'ప్రేమమ్‌, రారండోయ్‌ వేడుకచూద్దాం' చిత్రాలతో వరుసగా రెండు విజయాలను తన ఖాతాలో వేసుకున్న నాగచైతన్యకు 'యుద్దం శరణం' చిత్రం మాత్రం తీవ్రంగా నిరాశను మిగిల్చింది. ఈ చిత్రం నిర్మాత సాయి కొర్రపాటికి కూడా భారీ నష్టాలనే మిగిల్చింది. కాగా ఈచిత్రం పరాజయాన్ని తన తదుపరి చిత్రం ద్వారా తుడిచిపెట్టాలని నాగచైతన్య భావిస్తున్నాడు. ఆయన ప్రస్తుతం చందుమొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' అనే ఇంట్రస్టింగ్‌ టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ చిత్రం టైటిలే కాదు.. పోస్టర్‌ కూడా ఎంతో కొత్తదనంగా ఉంది.

Advertisement
CJ Advs

మైత్రిమూవీ మేకర్స్‌ సంస్థ నిర్మించనున్న ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం. ఇక ఈచిత్రంలో హీరోయిన్‌ కోసం వెతుకులాట మొదలైంది. చివరకు ఓ బాలీవుడ్‌ సెక్సీ సుందరిని ఏరికోరి ఎంచుకున్నారట. టైగర్‌ ష్రాఫ్‌ హీరోగా 'మున్నా మైఖేల్‌' చిత్రంలో నటించిన నిధి అగర్వాల్‌. ఈచిత్రం బాగా ఆడకపోయిన ఈ మొదటి చిత్రం ద్వారా ఈమెకి మంచి సెక్సీ ఇమేజ్‌ వచ్చింది. ఇటీవలే దర్శకుడు చందుమొండేటి ఈ భామని కలిసి స్టోరీని వినిపించి వచ్చాడట. ఆమె కూడా ఈ ప్రపోజల్‌కి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్‌ది విభిన్నకోణాలుంటే ఓ కీలకమైన పాత్ర అని తెలుస్తోంది. మొత్తానికి నాగచైతన్య 'సవ్యసాచి'పై ఎన్నో నమ్మకాలు పెట్టుకుని ఉన్నాడు. 

Nidhi Agarwal in Naga Chaitanya Savyasachi:

Bollywood Actress Nidhi Agarwal Got the Chance besides Naga Chaitanya in Savyasachi
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs