Advertisement
Google Ads BL

క్వీన్‌లా స్వేచ్చగా ఉంటానంటోంది..!


గత కొంతకాలంగా మిల్కీ బ్యూటీ తమన్నాకి ఏదీ కలిసిరావడం లేదు.మంచి హిట్స్‌ లేవు. అయితే తాజాగా ఆమెకు బాలీవుడ్‌లో కేవలం 15 కోట్లతో రూపొంది ఏకంగా 100 కోట్లకుపైగా వసూలు చేసిన కంగనా రౌనత్‌ చిత్రం 'క్వీన్‌' తెలుగు రీమేక్‌లో నటిస్తోంది. దీనికి నేషనల్‌ అవార్డు విన్నింగ్‌ డైరెక్టర్‌ నీలకంఠ దర్శకత్వం వహిస్తున్నాడు.ఈ చిత్రం షూటింగ్‌ తాజాగా ప్రారంభమైంది. ఈసందర్భంగా తమన్నా మాట్లాడుతూ, మహిళా స్వేచ్చని చూపించే చిత్రాలంటే నాకు చాలా ఇష్టం. 

Advertisement
CJ Advs

ఇలాంటి స్క్రిప్ట్‌లు దొరికితే నటించడానికి నేనెప్పుడూ సిద్దంగా ఉన్నాను. ఈచిత్రంలో మాదిరే నేను రాణిగా స్వేచ్చగా ఉంటాను. నా ఒరిజినల్‌ క్యారెక్టర్‌కి సరిగ్గా సరిపోయే చిత్రం ఇది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే నన్ను బాగా ఆకట్టుకుంది. ఇక ఈచిత్రాన్నిహిందీలో కంగనా రౌనత్‌ అద్భుతంగా చేసింది. నేను కూడా ఈ పాత్రకు పూర్తి న్యాయం చేస్తాను. ఇలాంటి చిత్రాలలో నటిస్తే ఎంతో ఆత్మసంతృప్తిగా కూడా ఉంటుందిన తెలిపింది. 

Tamannah Starring Queen Telugu Remake!:

Tamannah starring Kangana Ranaut is doing the Telugu remake of 'Queen'.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs