దేశం గర్వించదగ్గ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా 'భారతీయుడు 2'కి సన్నాహాలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈచిత్రానికి 180 నుంచి 200కోట్ల వరకు బడ్జెట్‌ని అనుకుంటున్నారు. ఇక ఈచిత్రం తాను నిర్మిస్తానని 'భారతీయుడు'ని నిర్మించిన ఎ.యం.రత్నం శంకర్‌ని కలవగా శంకర్ నో చెప్పాడట. మరోవైపు శంకర్ ఈచిత్రాన్ని నిర్మించమని 'బాహుబలి' నిర్మాతలైన శోభుయార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలను సంప్రదించారట.
కానీ ఈ నిర్మాతలు శంకర్‌తో చిత్రం చేయడానికి సానుకూలంగా లేకపోవడంతో చివరకు ఈ ప్రాజెక్ట్ దిల్‌రాజు చేతుల్లోకి వచ్చింది. మరి ఈ చిత్రం 'భారతీయుడు'లాగానే సంచలన విజయం సాధించడం ఖాయమంటున్నారు. మరి అంత మంచి అవకాశాన్ని 'బాహుబలి' నిర్మాతలు ఎందుకు వదిలేశారు? అనేది చర్చనీయాంశం అయింది. వారికి రాజమౌళితో ఉన్న కొన్ని కమిట్‌మెంట్స్ వల్లనే శంకర్‌కి నో చెప్పారనే వార్తలు వస్తున్నాయి.