Advertisement
Google Ads BL

ఆపరేషన్లకు కూడా పనికొస్తున్న 'బాహుబలి'!


ఈ మధ్య మన దేశంలోని డాక్టర్లు కూడా తమ వృత్తులలో సృజనాత్మకతను బయటికి తీస్తున్నారు. ఆ మద్య బెంగుళూరులో ఓ వ్యక్తి గిటార్‌ వాయిస్తుండగా శస్త్ర చికిత్స చేశారు. ఇక చెన్నైలో తాజాగా ఓపాప క్యాండీ క్రష్‌ ఆడుతుండగా, ఆ పాపకు మెదడుకు సర్జరీ చేశారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఓ స్టాఫ్‌ నర్స్‌కి ఫిట్స్‌ వచ్చాయి.ఆమెను గుంటూరు తీసుకుని వెళ్లి చూపించగా మెదడులో రక్తం గడ్డకట్టిందని దానికి ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. 

Advertisement
CJ Advs

అయితే ఈ ఆపరేషన్‌ నిర్వహించినంత సేపు పేషెంట్‌ మెలకువతోనే ఉండాలి. దాంతో తులసి హాస్పిటల్‌కి చెందిన డాక్టర్లు వినూత్నంగా ఆలోచించి ఆపరేషన్‌ థియేటర్‌లో 'బాహుబలి' చిత్రాన్ని ప్రదర్శిస్తూ పేషెంట్‌ ఆ సినిమాను చూస్తూ ఉండగా, ఆపరేషన్‌ని విజయవంతంగా పూర్తి చేశారు. రెండు తెలుగు రాష్ట్రాలలోనూ ఇలా ఆపరేషన్‌ చేయడం ఇదే మొదటిసారిగా వైద్యనిపుణులు చెబుతున్నారు. మొత్తానికి 'బాహుబలి' మాయ ఇంకా ఏదో రూపంలో కొనసాగుతూనే ఉంది. 

Operation Theaters Also Used Baahubali Movie!:

The doctors from the Tulsi Hospital innovatively thought of the movie 'Baahubali' in the Operation Theater, while the patient was looking at the film and successfully completed the operation.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs