అసలే మురుగదాస్, మహేష్ బాబుల కాంబినేషన్‌లో రూపొందిన 'స్పైడర్' చిత్రం మిక్స్‌డ్ టాక్‌తో ఇబ్బందులు పడుతుంది. ఇది ఇలా ఉంటే దీనికి ఇప్పుడు పైరసీ కూడా తోడైంది. దీంతో 'స్పైడర్' చిత్రానికి భారీ నష్టం కలిగే అవకాశం ఉందని అంటున్నారు. ఆన్‌లైన్‌లో, ఆఫ్‌లైన్‌లో ఈ పైరసీ జోరందుకుంది. దీని విచ్చలవిడి తనానికి పరాకాష్టగా చెప్పాలంటే ఈ చిత్రాన్ని పెన్ డ్రైవ్‌లోకి ఎక్కించి గుంటూరు నుంచి విశాఖపట్టణం వెళ్తున్న ప్రెవేట్ ట్రావెల్స్ బస్సులో ప్రదర్శించారు.
ఈవిషయం తెలిసిన ఓ అభిమాని పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి విషయం తెలపడంతో పోలీసులు ఈ బస్సును ఆపి పూర్తిగా చెక్ చేశారు. ఈ బస్సులో 'స్పైడర్'మూవీని వేసినట్లు ప్రాధమిక విచారణలో తేలింది. దీంతో ఈ వెంకటరమణ ట్రావెల్స్ బస్సును ఆపివేసి మరో బస్సుని తెప్పించి ప్రయాణికులను అందులో వైజాగ్‌కి పంపించారు. మరి బస్సులో పైరసీ సినిమాను వేసినందుకు ఎవరిపై ఏ విధమైన చర్యలు తీసుకోనున్నారో వేచిచూడాల్సివుంది....! మరోవైపు 'స్పైడర్' చిత్రం సీడీలు ఈ చిత్రానికి ఉన్న క్రేజ్ రీత్యా తెలుగు, తమిళంలో విచ్చలవిడిగా లభిస్తున్నాయి. కానీ సినిమా ఎలాగూ బాగాలేదని టాక్ రావడంతో ఎవ్వరూ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడం లేదు. దాంతో ఈ చిత్రం నిర్మాతలకు, పంపిణీ దారులకు పెద్ద నష్టాలనే మిగల్చనుందని అర్ధమవుతోంది.