Advertisement
Google Ads BL

ప్రభాస్‌ అందుకే ఒప్పుకున్నాడు..!


'బాహుబలి' రెండు పార్ట్స్ ద్వారా దేశ,విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకుని నేషనల్‌ స్టార్‌ అయిపోయాడు ప్రభాస్‌. కాగా 'బాహుబలి'తో వచ్చిన క్రేజ్‌ని ఏమాత్రం మిస్‌ కాకూడదనే ఉద్దేశ్యంతోనే బాలీవుడ్‌ హీరోయిన్‌ శ్రద్దాకపూర్‌, సంగీత త్రయం శంకర్‌-ఎహసాన్‌-లాయ్‌ల మ్యూజిక్‌తో పాటు ఈ చిత్రంలో తెలుగు, తమిళ, మలయాళ నటీనటులతో పాటు బాలీవుడ్‌కి చెందిన నీల్‌నితిన్‌ ముఖేష్‌, జాకీష్రాఫ్‌, చుంకీపాండే వంటి పలువురు బాలీవుడ్‌ నటీనటులు నటిస్తున్నారు. 

Advertisement
CJ Advs

'రన్‌ రాజా రన్‌' ఫేమ్‌ సుజీత్‌ దర్శకత్వంలో తన ఓన్‌ బేనర్‌ అయిన యువి క్రియేషన్స్‌ పతాకంపై ఈ చిత్రం రూపొందనుంది. ఇక దీని తర్వాతి చిత్రాన్ని కూడా ప్రభాస్‌ 'జిల్‌' ఫేమ్‌ రాధాకృష్ణ దర్శకత్వంలోనే యువి క్రియేషన్స్‌ బేనర్‌లోనే నటించడానికి ఓకే చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం 1980ల కాలం నాటి యూరప్‌ బ్యాక్‌ డ్రాప్‌లో జరిగే లవ్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం కథ జ్యోతిష్యానికి, సైన్స్‌కి మద్య నడిచే డిఫరెంట్‌ సబ్జెక్ట్‌ స్టోరీ అని తెలుస్తోంది. 

ఆస్ట్రాలజీకి సైన్స్‌కి మద్య జరిగే ఆసక్తికర కథతో ఈచిత్రం స్క్రిప్ట్‌ వర్క్‌ పూర్తయిందని, స్క్రిప్ట్‌ని ఒక్కసారి లాక్‌ చేసిన తర్వాత ప్రీప్రొడక్షన్‌ పనులపై దృష్టిపెట్టనున్నారట. ఈచిత్రాన్ని ఇండియాలో రిలీజ్‌ చేసేకంటే ముందే పలు యూరప్‌దేశాలలో జరిగే ఫిల్మ్‌ఫెస్టివల్స్‌లో ప్రదర్శించనున్నారని సమాచారం. 

Prabhas's Next Movie Based on Astrology?:

Prabhas even signed one more film in the direction of Radha Krishna Kumar who earlier directed Gopichand's Jil. The movie is expected to start shooting during the second half of next year.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs