Advertisement
Google Ads BL

ఇదిగో... అదిగో.. అంటున్నారు కాని..!


బాహుబలి మాదిరిగా భారీ బడ్జెట్ తో తెరకెక్కే సినిమాల లిస్ట్ టాలీవుడ్ లో రోజు రోజుకి పెరిగిపోతుంది. బాహుబలి తర్వాత స్పైడర్, సాహో చిత్రాలతో పాటే  ఇప్పుడు టాలీవుడ్ లో అతి భారీ ప్రాజెక్ట్ గా అలాగే క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కబోతున్న మరో చిత్రం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'సై రా నరసింహారెడ్డి' చిత్రం. అత్యంత క్రేజీ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రం అలనాటి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తెరకెక్కిస్తున్నారు. 'ఖైదీ నెంబర్ 150' ని నిర్మించిన రామ్ చరణ్ మరోసారి తండ్రి సినిమాతో భారీ లాభాలు కొట్టేయాలని 'సై రా' కి కూడా నిర్మాతగా మారిన విషయం తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కనున్న  ఈ చిత్రం పూజాది కార్యక్రమాలతో పాటే భారీ ఎనౌన్సమెంట్ అలాగే మోషన్ పోస్టర్ విడుదల కూడా జరుపుకుంది. కానీ ఇది జరిగి నెల రోజులు దాటుతున్న 'సై రా' ప్రాజెక్ట్ ఇంకా లెగ్యులర్ షూటింగ్ కి నోచుకోలేదు.

Advertisement
CJ Advs

ఇప్పటికే స్టోరీ, స్క్రిప్ట్ వర్క్ పూర్తయినా సినిమా షూటింగ్ మాత్రం  మొదలు కాలేదు. ఇదిగో... అదిగో.. అంటున్నారుగాని సినిమా షూటింగ్ మాత్రం మొదలుపెట్టడం లేదు. అయితే చిత్ర బృందం మాత్రం అక్టోబర్ నుండి 'సై రా' రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందంటున్నారు. కానీ బయట పరిస్థితులు చూస్తుంటే మాత్రం 'సై రా' అక్టోబర్ లో మొదలయ్యే సూచనలేమి కనబడడం లేదు. ఎందుకంటే 'సై రా' సినిమా కోసం ఎంపిక చేసిన టాప్ సినిమాటోగ్రాఫర్ అయిన రవివర్మ ఈ సినిమా నుండి తప్పుకోవడంతో అతని ప్లేస్ లోకి రత్నవేలును తీసుకున్నారు. అలాగే మరో పక్క సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహ్మాన్ కూడా తప్పుకున్నాడని న్యూస్ ఉండనే ఉంది.

మరి రత్నవేలు అయితే ప్రస్తుతం రామ్ చరణ్ 'రంగ స్థలం'  షూటింగ్ లో బిజీగా వున్నాడు. మరి 'సై రా' కోసం రత్నవేలు రావాలి అంటే అక్కడ 'రంగ స్థలం' షూటింగ్ పూర్తి కావాలి. అది పూర్తి కావాలి అంటే ఇంకా ఒక నెల సమయం పట్టేలా వుంది. మరి 'రంగ స్థలం' ఫినిష్ అయితే తప్ప రత్నవేలు 'సై రా' కోసం రాలేడు.  మరోపక్క 'సై రా' కోసం భారి నటీనటులను ఎంపిక చేసుకున్నారు. మరి వారి దగ్గర నుండి 'సై రా' కోసం డేట్స్ బుక్ చేసుకుంటే చిత్ర బృందానికి కష్టమే. డేట్స్ లాక్ చెయ్యకపోతే పర్వాలేదు. మరి ఈ సినిమా షూటింగ్ మాత్రం ఎపుడు స్టార్ట్ అవుతుందా అని మెగా అభిమానులతో పాటు దేశం మొత్తం ఎదురు చూస్తుంది.

Sye Raa Narasimha Reddy Movie Update!:

Ratnavelu to crank the camera after the exit of Ravi Varman.Ratnavelu can be available only if he completes Rangasthalam. <div></div>
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs