Advertisement
Google Ads BL

ఎవరు విలన్?.. హీరో? కొద్దిగా ఓపిక పట్టాల్సిందే!


సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన తాజా చిత్రం స్పైడర్ ప్రస్తుతం మిక్సిడ్ టాక్ తో ముందుకు వెళుతోంది. ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయినా ఈ స్పైడర్ చిత్రం మహేష్ కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఒకేసారి తెలుగు, తమిళ్ లో దర్శకుడు మురగదాస్ తనదైన శైలిలో తెరకెక్కించాడు. అయితే స్పైడర్ చిత్రంలో హీరోను పెద్దగా హైలెట్ చెయ్యకుండా విలన్ ని హైలెట్ చేస్తూ తమిళ తంబిలకు నచ్చేలా ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కించాడు. ఆ విషయం ఎలా ఉన్న ఇప్పుడు మహేష్ - మురుగదాస్ ఇద్దరు కలిసి  మరొక సినిమా ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది.

Advertisement
CJ Advs

దర్శకుడు మురగదాస్.... మహేష్, విజయ్ తో మల్టి స్టారర్ చిత్రం తెరకెక్కించాలని  ఉందని ఇది వరకే చెప్పాడు. కాని అభిమానులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అనే ఒక అనుమానం కూడా ఉందని వివరించాడు. అయితే ఇప్పుడు స్పైడర్ చిత్రం తర్వాత త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కనుందని టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే మురగదాస్ దగ్గర ఆ స్క్రిప్ట్ రెడీగా ఉందట. అయితే మురుగదాస్ తెరకెక్కించబోయే ఈ సినిమాలో స్పెషల్ ఏమిటంటే..... ఆ ఇద్దరు హీరోల్లో ఎవరో ఒకరు విలన్ గా కనిపించక తప్పదట. 

అయితే మన ఊహ ప్రకారం  తెలుగులో మహేష్ హీరోగా విజయ్ విలన్ గా చేపించి.....  ఇక తమిళ్ లో రివర్స్ గా విజయ్ హీరో, మహేష్ విలన్ గా కనిపించబోతున్నారేమో.... మరి ఈ సినిమాను మహేష్ ఒప్పుకున్నాడా లేదా అనేది ఇంకా ఫైనల్ కాలెదు. చూద్దాం ఈ సినిమా పట్టాలెక్కి.... నటీనటుల వివరాలు తెలిసే వరకు కొద్దిగా ఓపిక పట్టాల్సిందే.

Mahesh Babu and Vijay's Combo Soon?:

Multistarrer in the combo of Mahesh Babu and Vijay, Director AR Murugadoss.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs