Advertisement
Google Ads BL

బాలకృష్ణ కోసం హీరో విలన్ గా ఎంట్రీ!


బాలకృష్ణ  101 వ చిత్రం పైసా వసూల్ సెప్టెంబర్ 1 న విడుదలై సోది లోకి లేకుండా పోయింది.పైసా వసూల్ తో పైసల్ వసూలు చెయ్యలేక చతికిల పడింది. అయినా ఏమాత్రం అదరకుండా బాలకృష్ణ తన 102  వ చిత్రంపై పూర్తి ఫోకస్ పెట్టాడు. రవి కుమార్ దర్శకత్వంలో నటిస్తున్న బాలకృష్ణ ఆ సినిమా షూటింగ్ లో నిర్విరామంగా పాల్గొంటున్నాడు. ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో మెయిన్ హీరోయిన్ గా నయనతార నటిస్తుండగా మరో ఇద్దరు హీరోయిన్స్ కూడా ఉన్నారు. నయనతార ఫ్లాష్ బ్యాక్ లో బాలకృష్ణ కి తల్లిగా నటిస్తుందని.... బాలకృష్ణ ఈ చిత్రంలో డ్యూయెల్ రోల్ లో నటిస్తున్నాడని వార్తలు ఎప్పటినుండో ప్రచారంలో ఉన్నాయి.

Advertisement
CJ Advs

అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ కి విలన్ గా బాలీవుడ్ హీరో నటించబోతున్నాడనే న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హల్చల్ చేస్తుంది. ఇప్పటికే ఆ హీరో తో చిత్ర బృందం చర్చలు జరిపినట్టు... ఆ ప్రపోజల్ కి ఆ హీరో ఒప్పుకున్నట్టుగా చెబుతున్నారు. ఆ బాలీవుడ్ హీరో ఎవరో కాదు వివేక్  ఒబెరాయ్. రక్త చరిత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచుతుడైన వివేక్ ఒబెరాయ్ మొదటిసారి తెలుగులో విలన్ గా నటించబోతున్నాడు. అయితే వివేక్ కి తెలుగులో విలన్ గా చెయ్యడం కొత్తగాని తమిళ, హిందీ భాషల్లో ఎప్పుడో విలన్ గా చేశాడు వివేక్ ఒబెరాయ్. తమిళంలో తాజాగా అజిత్ సినిమా వివేగం సినిమాలో వివేక్ స్టైలిష్ విలన్ గా అదరగొట్టాడు.

మరి అక్కడ తమిళనాట వివేగం తో విలన్ గా సక్సెస్ సాధించలేకపోయిన వివేక్ ... ఇక్కడ తెలుగులో అయినా విలన్ గా హిట్ కొట్టి... విలన్ కేరెక్టర్స్ లో పాతుకు పోవాలని చూస్తున్నాడు. చూద్దాం వివేక్ లక్కు తెలుగులో ఎలా వుండబోతుందో...! 

Bollywood Villain for Balayya 102 Movie!:

Now, we got an update that Bollywood actor, Vivek Oberoi has signed the movie as an will be making a come back into Telugu as a villain with Balakrishna's 102nd film.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs