Advertisement
Google Ads BL

అమ్మ మృతిపై మరిన్ని సందేహాలు..!


తమిళనాడులోని మెజార్టీ ప్రజలు అమ్మ జయలలిత మరణంపై సందేహంగానే ఉన్నాయి. ఇక రాష్ట్రానికి చెందిన మంత్రులు కూడా తలో విధంగా వ్యాఖ్యానిస్తున్నారు. తాజాగా ప్రతిపక్షనేత, డిఎంకే నేత స్టాలిన్‌ ఈ విషయంలో గవర్నర్‌ విద్యాసాగర్‌రావు కల్పించుకోవాలని కోరారు. ఇక తాజాగా తమిళనాడు హైకోర్టు కూడా జయ మరణంపై అనుమానాలు వ్యక్తం చేయడం ఆసక్తికరంగా మారింది. 

Advertisement
CJ Advs

జయలలిత అనారోగ్యంతో చెన్నైలోని అపోలో హాస్పిటల్‌లో ఉన్నప్పుడు జరిగిన ఉప ఎన్నికలలో జయ తన బీఫాంపై వేలి ముద్రలే ఎందుకు వేసింది? ఆమె స్పృహలోనే ఉందని వాదిస్తున్న శశికళ చేస్తున్న వాదనలో నిజమెంత? ఆమె స్పృహలోనే ఉంటే సంతకం చేయకుండా వేలిముద్రలు ఎందుకు వేసిందో తెలిపాలని, ఈ విషయమై కేంద్ర ఎన్నికల కమిషన్‌ ప్రిన్సిపుల్‌ సెక్రటరీ వచ్చే నెల ఆరోతేదీలోగా తమ ఎదుట నేరుగా హాజరై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అమ్మ మృతిపై మరోసారి అనుమానాలు చెలరేగడంతో నిజాలు నిగ్గుతేల్చేందుకు ప్రభుత్వం ఓ విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేసింది. 

జస్టిస్‌ ఆర్ముగస్వామి నేతృత్వంలోని ఏక సభ్య కమిషన్‌ మూడు నెలలలోగా విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. జయ మృతిపై ప్రభుత్వం విచారణ కమిషన్‌ని ఏర్పాటు చేయడాన్ని అపోలో హాస్పిటల్‌ చైర్మన్‌ ప్రతాప్‌ సి.రెడ్డి స్వాగతించారు. అయినా అమ్మ మృతి సమయంలో నాటి కేంద్రమంత్రి, నేటి ఉప రాష్ట్రపతి వెంకయ్య అక్కడ ఉన్నాడు. ఇక కేంద్రం కూడా ఈ విషయంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లోకి తీసుకుని రావాలని చేస్తోందే గానీ, ఓ ముఖ్యమంత్రి మరణాన్ని పెద్దగా పట్టించుకోకపోవడం కూడా పలు అనుమానాలకు తావిచ్చే విధంగా ఉంది. 

New Doubts Raised on Jayalalitha Death:

Central EC and DMK Leader Stalin Demands Behind the Truth of Jayalalitha death
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs