ప్రస్తుతం అల్లుఅర్జున్ స్టార్‌రైటర్ వక్కంతం వంశీని దర్శకునిగా పరిచయం చేస్తూ 'నా పేరు సూర్య... నా ఇల్లు ఇండియా' అనే దేశభక్తి చిత్రంలో జవాన్ పాత్రను పోషిస్తున్నాడు. దీని తర్వాత ఆయన 'టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా' దర్శకుడు విఐ. ఆనంద్ దర్శకత్వంలో ఓ చిత్రం చేస్తాడని, ఆ తర్వాత తమిళంపై దృష్టి పెట్టి తమిళ దర్శకునితో తెలుగు, తమిళంలో చిత్రం చేయనున్నాడని సమాచారం. ముందునుంచి ఈ చిత్రానికి లింగుస్వామి పేరు వినిపిస్తోంది. కానీ ప్రస్తుతం ఆయన ఫామ్‌లో లేకపోవడంతో దర్శకుడు ఎవరు? అనే సస్పెన్స్ సాగుతోంది.
ఇక విఐ ఆనంద్ ప్రస్తుతం ఆయన సోదరుడు అల్లుశిరీష్ హీరోగా ఓ సైన్స్‌ఫిక్షన్ చిత్రం చేస్తున్నాడు. ఇక తాజాగా బన్నీ ఖాతాలో బాబి పేరు కూడా వినిపిస్తోంది. 'పవర్' చిత్రంతో యావరేజ్‌గా పేరు తెచ్చుకుని, 'సర్దార్‌గబ్బర్‌సింగ్'తో డిజాస్టర్ అందుకుని, తాజాగా ఎన్టీఆర్‌తో 'జై లవకుశ'ని డైరెక్ట్ చేసిన బాబి 'జైలవకుశ' సెట్స్‌లో ఉండగానే బన్నీకి కలిసి ఓ స్టోరీ చెప్పాడని తెలుస్తోంది. దీంతో ఆయనకు ఓ సెంటిమెంట్‌ని ఇండస్ట్రీ వారు ప్రచారం చేస్తున్నారు.
'సుబ్రహ్మణ్యం ఫర్‌సేల్' షూటింగ్ సమయంలోనే దర్శకుడు హరీష్‌శంకర్ దిల్‌రాజు సలహాతో బన్నీకి 'డిజె' స్టోరీ చెప్పి ఒప్పించుకుని వచ్చాడు. ఇక తాజాగా బాబిసైతం అదే పనిచేయడంతో 'జై లవకుశ' హిట్టయిందని, దీంతో మరికొందరు దర్శకులు కూడా ఇదే సెంటిమెంట్‌ను ఫాలో అవుతారని అంటున్నారు. అయితే బాక్సాఫీస్ వద్ద 'డిజె' విషయంలోనే కాదు 'జై లవకుశ' విషయంలోనూ డివైడ్ టాక్ వినిపిస్తూ వివాదాలకు కారణమవుతోంది కానీ యునానిమస్ హిట్ అనే టాక్ రెండు చిత్రాలకు రాలేదన్నది వాస్తవం.