సౌతిండియన్ చిత్రాలలో మరీ ముఖ్యంగా తెలుగు, కన్నడలో స్దిరపడాలని లక్ష్మీరాయ్ అలియాస్ రాయ్‌లక్ష్మీ ఎన్నో ప్రయత్నాలే చేసింది. చివరకు వచ్చిన అవకాశాలు వదులుకోకూడని పవన్‌తో 'సర్దార్‌గబ్బర్‌సింగ్', మెగాస్టార్ చిరంజీవితో 'ఖైదీ నెంబర్ 150'లో చిందులేసింది. కానీ ఈ అందాల ఆరబోతలను, చిందులని చూసి మన ప్రేక్షకులు, దర్శకనిర్మాతలు నోరు చప్పరించారే గానీ సరైన అవకాశాలు మాత్రం ఇవ్వలేదు. ఇక ఆమద్య ధోనితో ఎఫైర్ నడిపి బాలీవుడ్ దృష్టిలో పడాలని చూసినా వర్కౌట్ కాలేదు. ఎట్టకేలకు ఆమెకు థ్రిల్లర్ మూవీ 'జూలీ2'లో అల్ట్రా మోడ్రన్ లుక్‌లో అందాలన్ని ఆరబోసే లీడ్‌రోల్ వచ్చేసింది. దీంతో అవకాశాలు అరుదుగా వస్తాయని, కాబట్టి ఆ అవకాశాలు వచ్చినప్పుడే ఉపయోగించుకోవాలని ఈ అమ్మడు సిద్దపడిపోయి 'జూలీ2'లో అన్ని అందాలను ఆరబోస్తోంది.
ఇప్పటికే విడుదలైన లుక్స్, పోస్టర్స్, టీజర్స్, ట్రైలర్స్ చూస్తే బాలీవుడ్‌లో స్ధిరపడేందుకు అవసరమైతే సన్నిలియోన్ వంటి వారికి కూడా గ్లామర్‌షోలో పోటీ ఇచ్చేందుకు ఈమె రెడీగా ఉందని భావించవచ్చు. ఇక ఈ చిత్రంలో తాను 96 రకాల ఔట్‌ఫిట్స్‌లో కనిపించానని, ఈ చిత్రం కోసం తానెంతో కష్టపడ్డానని రాయ్‌లక్ష్మి చెబుతోంది. నిజమే.... ఇప్పటికే విడుదలైన భంగిమలు, అందాలు ఓ రేంజ్‌లో ఉంటే ఇక సినిమా థియేటర్‌లో వెండితెరపై ఈ అమ్మడు అందాలను చూసి తెరపైనే ఆమె అందాలను జుర్రుకోవాలని యూత్‌పడిగాపులు కాస్తున్నారు. ఎట్టకేలకు ఈచిత్రం అక్టోబర్ 6న విడుదల కానుంది.
ఇక తాజాగా విడుదలైన ఓ పిక్‌లో ఆమె అందాలను వర్ణించడం బహుశాబూతు కవులకి తప్ప నిజమైన కవులకు సాధ్యంకాకపోవచ్చు. సాయంత్రం సమయాన.. సూర్యడు అస్తమించే వేళలో టాప్‌లెస్‌గా బీచ్‌లో సేద తీరుతూ, ఆమె చూపిస్తున్న బ్యాక్ అందాలు మతులను పోగోడుతున్నాయనేది నిజం. మరి పూర్తి సమాచారం అక్టోబర్ 6న సిల్వర్‌స్క్రీన్‌పై లభిస్తుంది...! అందరు ఎంతో కష్టపడ్డానని ఆమె చెబుతుంటే ఏమో అనుకున్నారు. నిజంగానే ఈ విషయంలో రాయ్‌లక్ష్మి బాగా కష్టపడిందని ఒప్పుకోవాల్సిందే.