అన్ని సినిమా పరిశ్రమల్లో... సినిమాల్లో హీరోలకున్న ప్రాధాన్యత మరే ఇతర కేరెక్టర్ కి ఉండదు. సినిమా మొత్తం హీరో పాత్రలే నడిపిస్తాయి. అంత పవర్ ఫుల్ రోల్స్ లో హీరో పాత్రలను తీర్చిదిద్దుతారు దర్శకులు... సినిమా రైటర్స్. హీరో పాత్ర సినిమాలో ఏమాత్రం తక్కువ ఉందా ఆయా హీరోల అభిమానుల రచ్చ చూడలేం. కాకపోతే హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాల్లో మాత్రం చిన్న హీరోలను పెట్టి పెద్ద హీరోయిన్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. అయితే కొన్ని సినిమాల్లో మాత్రం హీరో పాత్రలకు ధీటుగా విలన్స్ పాత్రలను కూడా సృష్టిస్తున్నారు సినిమా రైటర్స్. గతంలో అంటే 2015 లో తమిళంలో తెరకెక్కిన తని ఒరువన్ సినిమాలో హీరో పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉందో.... విలన్ పాత్రకి అంతకంటే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చాడు దర్శకుడు. మోహన్ రాజా దర్శకత్వంలో జయం రవి, నయనతార జంటగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఒకప్పటి హీరో అరవింద్ స్వామిని విలన్ గా ఈ సినిమాని తెరకెక్కించాడు. ఆ చిత్రంలో జయం రవి కన్నా.. విలన్ గా చేసిన అరవింద్ స్వామి పాత్రే పవర్ ఫుల్. మోడ్రెన్ టెక్నాలజి కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాలో విలన్ ఫైట్స్ గట్రా చెయ్యకుండా హీరోగారి కదలికలు కనిపెడుతూ విలనిజాన్ని పండించాడు. ఆ పాత్ర అరవింద్ స్వామికి ఎంతో పేరుని తీసుకురావడమే కాక ఆ సినిమా పెద్ద హిట్ కూడా అయ్యింది.
అదే సినిమాని తెలుగులో రామ్ చరణ్ హీరోగా మాతృక విలన్ అరవింద్ స్వామినే విలన్ గా తీసుకుని డైరెక్టర్ సురేందర్ రెడ్డి ధ్రువ గా రీమేక్ చేశాడు. ఈ సినిమా రామ్ చరణ్ కి మంచి హిట్టిచ్చింది. అయితే ఇప్పుడు ఆ సినిమాలో విలన్ తరహాలోనే మురుగదాస్ మహేష్ హీరోగా తెరకెక్కించిన స్పైడర్ లో కూడా దర్శకుడు ఎస్.జే. సూర్యని విలన్ గా తీసుకున్నాడు. ఈ చిత్రంలో విలన్ గా నటించిన సూర్య సైకో విలన్ గా ఇరగదీశాడు. మహేష్ పాత్రకన్నా విలన్ గా చేసిన సూర్య పాత్రకే మురుగదాస్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చాడు. మరి మురుగదాస్, సూర్య మీద పెట్టుకున్న నమ్మకాన్ని సూర్య విలనిజాన్ని అత్యంత అద్భుతంగా పండించి రక్తి కట్టించాడని... కేవలం విశ్లేషకులే కాదు... స్పైడర్ చూసిన ప్రతి ఒక్క ప్రేక్షకుడి స్పందన. సూర్య ముఖంలో విలన్ గా ఇచ్చిన ఎక్సప్రెషన్స్ అదుర్స్.. ఓ రేంజ్ లో విలన్ గా సూర్య ఈ సినిమాలో మెప్పించాడు. ఇక మహేష్ పాత్ర కన్నా సూర్య పాత్రకే దర్శకుడు ఇంపార్టెన్స్ ఇవ్వడం వెనుక లాజిక్ జనాలకు సరిగ్గా అర్ధం కాకపోయినా..... సూర్య విలన్ పాత్రలో అదరగొట్టేశాడు. ఇక ఈ బుధవారం విడుదలైన స్పైడర్ నెగెటివ్ టాక్ ని తెచ్చుకున్నా కలెక్షన్స్ పరంగా మాత్రం టాప్ ప్లేస్ లో దూసుకుపోతోంది.