జై లవ కుశ కి మిశ్రమ స్పందన.... స్పైడర్ స్పందన సరిగ్గా అర్ధం కావడం లేదు... మరి మిగిలింది శర్వానంద్ నటించిన మహానుభావుడు టాక్ మాత్రమే. దసరా బరిలో దిగబోతున్న మహానుభావుడు సినిమాపైనే అందరి కళ్ళు ఉన్నాయి. యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన జై లవ కుశ ఓకే అనిపించగా... స్పై థ్రిల్లర్ గా వచ్చిన స్పైడర్ చతికిల పడిందనే టాక్ ఉంది. అయితే ఆ రెండు చిత్రాలకు విభిన్నమైన కథతో అంటే ఫుల్ కామెడీ ఎంటెర్టైనర్ గా రాబోతున్న మహానుభావుడుపైనే విపరీతమైన ఆసక్తి కనబరుస్తున్నారు ప్రేక్షకులు. అయితే ఈ చిత్రంలో హీరోకి ఓసిడి ఉంటుంది. ఓసిడి అంటే అతనికి విపరీతమైన అతి శుభ్రత అనే డిజాస్టర్ అన్నమాట. ఇక ఈసినిమా ఆద్యంతం నవ్వులు పూయిస్తుంది అంటున్నారు దర్శకుడు మారుతీ, హీరో శర్వానంద్.
ఇక ఈ మహానుభావుడు కథని క్లుప్తంగా చెప్పుకుంటే.... మహానుభావుడులో హీరో పాత్రకి ఓసిడి కారణంగా అతిశుభ్రత ఉండడంతో.... అతని వస్తువులనే కాక పక్కన వారి వస్తువులని కూడా శుభ్రం చెయ్యడం... ఇంకా ఈ అతిశుభ్రతతో పక్కన వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే హీరోయిన్ మాత్రం ఆ హీరోగారి అతిశుభ్రతకి పడిపోయి ప్రేమించేస్తుంది. అలాగే తన కుటుంబం లోని వాళ్ళని కూడా తన ప్రేమని ఒప్పిస్తుంది. కానీ అనుకోని పరిస్థితుల్లో హీరోయిన్ కి హీరో గారి అతిశుభ్రత వల్ల సమస్యలు రావడంతో తన ప్రేమను వదులుకుని వెళ్ళిపోతుంది. మరి హీరో శర్వా హీరోయిన్ మెహ్రీన్ కోసం వాళ్ళ ఊరు వెళ్లి అక్కడ తన అతి శుభ్రతని వదిలేసి హీరోయిన్ ని ఎలా మెప్పించాడనే దాని మీద మహానుభావుడు ఆధారపడిందనే టాక్ ఇండస్ట్రీ వర్గాల్లో ఉంది.
ఇక సినిమా మొత్తం అదిరిపోయే కామెడీ ఉండబోతుందని... భలే భలే మగాడివోయ్ రేంజ్ లో ఈ మహానుభావుడు కూడా హిట్ కొడుతోంది అంటున్నారు. అలాగే ఈ దసరా రేస్ లో శర్వానంద్ విన్నర్ గా నిలుస్తాడనే టాక్ కూడా వినబడుతుంది. చూద్దాం మరికాసేపట్లో మహానుభావుడు రిజల్ట్ కూడా తెలిసిపోతుంది.