Advertisement
Google Ads BL

కమల్ లాంటి పిచ్చోళ్ళు పాలిటిక్స్ కి అనర్హులు!


మొత్తానికి తమిళనాడు రాజకీయాలు మరింత రసకందాయంలో పడి కుమ్ములాటలు, ధూషణ పర్వాలు మొదలయ్యాయి. ఆ మద్య రజనీకాంత్‌ని ఉద్దేశించి కమల్‌ ఆయనకు మైక్‌, కెమెరాలు కనిపిస్తే ఊగిపోతాడని నానా మాటలు అన్నాడు. ఇక కమల్‌ మంచి నటుడే కావచ్చు కానీ ఆయన వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదం. ఆయన మన దేశంలో సహజీవనాల పేరుతో, తర్వాత వివాహం చేసుకోవచ్చులే అని ఎందరో మహిళలను వంచించాడు. వారిలో సీనియర్‌ నటి శ్రీవిద్య, వాణిగణపతి, సారిక, గౌతమి, సిమ్రాన్‌, త్రిష వంటి ఎందరో ఉన్నారు. ఇక ఆయన హిందూ దేవుళ్లను, హిందూ సంస్థలను కించపరుస్తూ, ఇప్పటికే భగవద్గీత, మహాభారతం, రామాయణం వంటి హిందూవులకు దైవ సమానమైన వాటిని అవమానించాడు. 

Advertisement
CJ Advs

ఇక తాజాగా రజనీని కించపరుస్తూ ఆయనతో కలిసి పనిచేయడానికి అభ్యంతరం లేదంటూనే నేను నాస్తికుడిని, రజనీకి మాత్రం ఆయనకున్న మత విశ్వాసాల ప్రకారం 'కాషాయం' అయిన బిజెపినే బెటర్‌ అని సెటైర్లు వేశాడు. అయితే నాస్తికత్వం అంటే ఏ దేవుడిని నమ్మకపోయినా నమ్మేవారి మనస్సులను గాయపర్చడం కాదని కమల్‌ తెలుసుకోవాలి. ఇక గోమాంసం తింటే తప్పేంటి.. ప్రపంచంలో ఆవుతో సహా అన్ని మాంసాలు తిని ఉన్నాను. కేవలం స్పెషల్‌గా లభించే తిండి కోసమే విదేశాలకు కూడా వెళ్తానని గో మాంసం విషయంలో హిందువుల మనోభావాలను దెబ్బతీశాడు. ఇక ఆయన స్వేచ్ఛ పేరుతో తన కూతుర్లయిన శృతిహాసన్‌, అక్షర హాసన్‌లను ఎలా పెంచాడో వారి కెరీర్‌ని, వారి ప్రవర్తనను చూస్తే అర్ధమవుతోంది.

తాజాగా తమిళనాడు డీఎంకే నేత స్టాలిన్‌, కమల్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కమల్‌ ఒకసారి 'కాకి' అని మరోసారి 'కాషాయం' అని అయోమయ వ్యాఖ్యలు చేస్తున్నాడని, ప్రజాస్వామ్య మనదేశంలో పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ రాజకీయాలలోకి వచ్చే వీలుందని, కానీ పిచ్చివారికి మాత్రం ఆ అవకాశం లేదంటూ కమల్‌పై పరోక్షంగా విరుచుకుపడ్డాడు. ఇక జయలలిత మృతి పట్ల మంత్రులు రోజుకో విధంగా మాట్లాడుతున్నారని, ఆమె మృతికి సంబంధించిన అసలు విషయాలు బయటికి రావాలంటే గవర్నర్‌ విద్యాసాగర్‌రావు జోక్యం చేసుకోవాలని ఈ ప్రతిపక్షనేత అన్నాడు. మొత్తానికి కమల్‌ ఎన్ని మాట్లాడినా రజనీ అయితే నవ్వుతూ ముభావంగా ఉంటారు గానీ స్టాలిన్‌ ఆ టైప్‌ కాదు కదా...! 

DMK Leader Stalin Fires on Kamal Haasan:

DMK party Stalin on Kamal Haasan Politics
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs