Advertisement
Google Ads BL

'సై రా' కి నో చెప్పిన ఖైదీ భామ..!


కాజల్ అగర్వాల్ కి అవకాశాలు లేనప్పుడు రామ్ చరణ్ పిలిచి తన తండ్రి సినిమా ఖైదీ నెంబర్ 150  లో ఛాన్స్ ఇచ్చాడు. ఆ సినిమాతో ఆఫర్స్ లేక అలల్లాడుతున్న కాజల్ కి కాసింత ఊరట దొరికింది. ఖైదీ సినిమా హిట్ తో  ఇండస్ట్రీలో వరుస అవకాశాలు అందుకుంటూ మళ్ళీ ఫామ్ లోకొచ్చేశానని చెప్పకనే చెప్పింది. ఆ తర్వాత నేనే రాజు నేనే మంత్రి హిట్... అలాగే మరోపక్క కాజల్ నటించిన కోలీవుడ్ సినిమా మెర్సల్ కూడా దీపావళి కానుకగా విడుదలకు సిద్ధంగా వుంది. స్టార్ హీరో విజయ్ తో జోడి కట్టిన కాజల్ ఈ సినిమా విజయం కోసం ఎదురు చూస్తుంది. ఇక అజిత్ తో కలిసి నటించిన వివేగం ప్లాప్ అయినప్పటికీ ఆ సినిమాలో కాజల్ నటనకు, అందానికి   మంచి పేరొచ్చింది. 

Advertisement
CJ Advs

ఇక ఇప్పుడు ఒక న్యూస్ ఫిలింనగర్ సర్కిల్స్ లో హాట్ హాట్ ప్రచారంలో ఉంది. అదేమిటంటే.... కాజల్ మెగా ఆఫర్ ని కాదంది అని. అది కూడా రామ్ చరణ్ ఎంత చెప్పినా సున్నితంగా వద్దనేసిందనే టాక్ వినబడుతుంది. ఇంతకీ విషయం ఏమిటంటే... కాజల్ అగర్వాల్ కి సై రా నరసింహారెడ్డిలో వన్ అఫ్ ది హీరోయిన్ ఛాన్స్ వచ్చిందట. చిరు పక్కన ముగ్గురు హీరోయిన్స్ సై రా లో ఉంటారనే  టాక్ ఉంది. అందులో మెయిన్ లీడ్ లో నయనతార నటిస్తుండగా.... సెకండ్ హీరోయిన్ గా బాలీవుడ్ భామల్లో ఒకరిని సెలక్ట్ చేస్తారని... ఇక మూడో హీరోయిన్ పాత్రకి.... ముఖ్యమైన ఈ పాత్రకు  కాజల్ ని సంప్రదించగా ఆమె నో అనేసింది.

అయితే ఆ పాత్ర ఎంత కీలకమైన కూడా పాత్ర నిడివి చాల తక్కువ వుండడంతోనే కాజల్ నో చెప్పిందనే న్యూస్ వినబడుతుంది. ఇక కాజల్ నో చెప్పిన పాత్రకి ఇప్పుడు సై రా టీమ్ ప్రగ్య జైజ్స్వాల్ ని ఫైనల్ చేశారట.

Kajal Agarwal no to Sye Raa offer :

Kajal Agarwal Rejected 3rd heroine chance
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs