ప్రస్తుతం ఫిల్మ్‌నగర్‌లో మురుగదాస్ మహేష్‌బాబుతో చేసిన 'స్పైడర్' చిత్రం చర్చనీయాంశం అయింది. ఈ చిత్రం టాక్ సంగతి పక్కనపెడితే ఈ కథను మొదట మురుగదాస్, యంగ్‌రెబెల్‌స్టార్ ప్రభాస్ కి చెప్పాడని, కానీ అతను అప్పటికే 'బాహుబలి' షూటింగ్‌లో ఉండటం, ఆ తర్వాత కూడా 'సాహో' వంటి కమిట్‌మెంట్స్ వల్ల ప్రభాస్ నో చెప్పాడనే వార్త వినిపిస్తోంది. కానీ తాను ప్రభాస్‌కి ఫోన్ చేసి మాట్లాడిన మాట నిజమేనని, కానీ తాను 'స్పైడర్' స్టోరీని గూర్చి చెప్పడానికి ప్రభాస్‌కి ఫోన్ చేయలేదని, మహేష్‌తో తనకు అంతకుముందే పరిచయం ఉండటంతో ఆయనకు కథ చెప్పి 'స్పైడర్' ఓకే చేయించానని చెబుతున్నాడు మురుగదాస్.
ఇక ఈ చిత్రం విడుదలై మిక్స్‌డ్ రిజల్ట్‌ని రాబడుతోంది. బిసి కేంద్రాలలో ఈ చిత్రంపై పెద్ద ఆశలు పెట్టుకోవాల్సిన అవసరమే లేదని, కేవలం 'ఎ' సెంటర్ ఆడియన్స్, మల్టిప్లెక్స్ ఆడియన్స్‌తో పాటు ఓవర్‌సీస్‌లో మాత్రమే ఈచిత్రం గట్టిగా వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్‌వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ చిత్రం రిజల్ట్ సంగతి ఎలా ఉన్నా.. ఈ సినిమాని భారీ ధరకు కొన్న బయ్యర్లకు, నిర్మాతలకు సినిమా సేఫ్ కావడం కష్టమేనంటున్నారు. ఇక ఓవర్‌సీస్‌లో ఈచిత్రం ఐదు మిలియన్ డాలర్లను దక్కించుకుంటేనే కాస్త లాభాలు వస్తాయని విశ్లేషిస్తున్నారు.
ఇక మురుగదాస్ కంటూ ఓ బ్రాండ్, ఓ ప్రత్యేకమైన స్టైల్ ఉంది. అది 'స్పైడర్'లో కనిపించడం లేదు. కాగా మురుగదాస్ తాజాగా మాట్లాడుతూ, నేను 'రమణ, గజిని' చిత్రాలు తీసిన తర్వాత మెగాస్టార్ నుంచి పిలుపు వచ్చిందని, ఆయనకు 'స్టాలిన్' కథ చెప్పానని, ఆయన సంతోషంగా ఒప్పుకున్నారని చెప్పాడు. కానీ తనకు అంతకు ముందు కేవలం మూడు సినిమాలు మాత్రమే తీసిన అనుభవం ఉండటం, ఆయన వయసులో, అనుభవంలో నా కంటే చాలా పెద్దవారు కావడంతో ఆయన్ను సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయానని, కానీ మహేష్‌తో తనకు ఆ ప్రాబ్లమ్ రాలేదని, ఆయన వయసు నా వయసు ఒకటే కావడంతో ఎంతో సమన్వయంతో సినిమా చేశామని చెప్పాడు. కానీ 'స్పైడర్' చిత్రం చూసిన వారు మాత్రం మురుగదాస్ మరోసారి 'స్టాలిన్' తర్వాత మహేష్‌తో కూడా తడబడ్డాడనే అంటున్నారు.