Advertisement
Google Ads BL

100 కోట్లతో కళ్యాణ్ రామ్ లో కదలికొచ్చింది!


కళ్యాణ్ రామ్ నిర్మాతగా... బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన జై లవ కుశ  గత గురువారం అంటే సెప్టెంబర్ 21 న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. జై లవ కుశ లోని జై పాత్ర విశేషంగా ఆకట్టుకుని మిశ్రమ స్పందనతోనే ఈ సినిమా కోట్లు కొల్లగొడుతుంది. ఎన్టీఆర్ జై పాత్రకి ప్రేక్షకులు నీరాజనాలు పలుకుతున్నారు. మరి జై లవ కుశ విడుదలైన మొదటిరోజులోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ 20  కోట్ల షేర్ సాధించడమే కాక ప్రపంచ వ్యాప్తంగా 30  కోట్ల షేర్ సాధించి ఎన్టీఆర్ కెరీర్ లోనే మొదటిరోజు భారీ వసూళ్లు కొల్లగొట్టిన చిత్రంగా రికార్డు సృష్టించింది. 

Advertisement
CJ Advs

మొదటి రోజు కలెక్షన్స్ అదరగొట్టినా కూడా రెండో రోజు కాస్త వీక్ అయినా కలెక్షన్స్ మళ్ళీ వీకెండ్ లో పుంజుకుని బాక్సాఫీసుని దడదడలాడించిన ఈ చిత్రం మొదటి వారం పూర్తికాక ముందే 100 కోట్ల క్లబ్‎లో చేరిపోయింది. ఈ విషయాన్నీ ఎన్టీఆర్ ఆర్ట్స్ సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించింది. అలాగే జై లవ కుశ నిర్మాత కళ్యాణ్ రామ్ తన ట్విట్టర్ ద్వారా ప్రపంచంలోని తెలుగు సినిమా అభిమానులందరికీ ధన్యవాదాలు  తెలుపుతూ.. జై లవ కుశ 100 కోట్ల క్లబ్బులో నిలిచిన జై లవ కుశ పోస్టర్ ని షేర్ చేశాడు. మరి దసరా సెలవలు జై లవ కుశ కు బాగా కలిసొచ్చాయనే విషయం దీని బట్టే అర్ధమయ్యింది.

అలాగే ఇక ఇప్పుడు జై లవ కుశ కలెక్షన్స్ ని స్పైడర్ గండికొట్టేలాగే కనబడుతుంది. మహేష్ -మురుగదాస్ కలయికలో వచ్చిన స్పైడర్ చిత్రం ఈ రోజు బుధవారం ప్రపంచ వ్యాప్తంగా  అత్యధిక థియేటర్స్ లో విడుదలైంది. మరి స్పైడర్ చిత్రం టాక్ ఎలావున్నా కూడా ఈ వీకెండ్ స్పైడర్ హవానే కొనసాగుతుంది అనడంలో సందేహంలేదు.  అలాగే మరొక్క రోజులోనే శర్వానంద్ మహానుభావుడు కూడా విడుదల కానుంది. మరి ఈ రెండు చిత్రాల పోటీని తట్టుకుని జై లవ కుశ ఇంకెన్ని కలెక్షన్స్ కొల్లగొడుతుందో చూద్దాం.

Kalyanram posted Jai Lava Kusa 100 crores poster:

Jai Lava Kusa crossed 100 crores
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs