Advertisement
Google Ads BL

సమంత పెళ్లి వల్ల ఎవరికీ ప్రాబ్లమ్ లేదు!


మరికొన్నిరోజుల్లో అంటే వచ్చే అక్టోబర్ 6 న అక్కినేని కుటుంబానికి కోడలిగా హీరోయిన్ సమంత అడుగుపెట్టబోతుంది. నాగార్జున కుమారుడు నాగ చైతన్య ని వివాహమాడనున్న సమంత... పెళ్లి తర్వాత కూడా నటించడానికి సిద్దమని ఎప్పుడో చెప్పింది. ఒక పక్క పెళ్లిపనులతో బిజీగా వున్నా కూడా తన కమిట్మెంట్స్ ని మాత్రం వదలడంలేదు. అలాగే కొత్త సినిమాలకు సైన్ కూడా చేస్తుంది. అయితే గతంలో ఒప్పుకున్న సినిమాలన్నీ ఇప్పుడు అంటే సమంత పెళ్లి సమయానికి ఇంకా షూటింగ్ జరుపుకుంటూనే ఉన్నాయి. అందులో భారీ బడ్జెట్ సినిమా అయిన రంగస్థలం కూడా ఉంది. సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత హీరోయిన్. అయితే ఈ చిత్ర షూటింగ్ ఇంకా పూర్తి కాలేదేమో పెళ్లి తర్వాత కూడా కొన్ని రోజులు గ్యాప్ తీసుకుని రంగస్థలం షూటింగ్ లో సమంత పాల్గొంటుందేమో అనుకున్నారు.

Advertisement
CJ Advs

కానీ పెళ్ళికి ముందే సమంత రంగస్థలంలో తనకు సంబందించిన సన్నివేశాలను పూర్తి చేసేసిందట. ఈ విషయాన్నీ దర్శకుడు సుకుమార్ స్వయంగా ప్రకటించాడు. రంగస్థలంలో సమంత షూటింగ్ పూర్తయిందని... హైదరాబాద్ లో వేసిన సెట్ తో పాటు బూత్ బంగ్లాలో తీసిన భారీ ఎపిసోడ్ తో సమంత పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిపోయిందని సుకుమార్ ప్రకటించాడు. ఏమన్నా అవసరం అనుకుంటే పెళ్లి తర్వాత ఒక మూడు రోజుల కాల్షీట్స్ ఇవ్వడానికి సమంత రెడీగా ఉందని చెబుతున్నాడు.

మరి ఈ లెక్కన సమంత పెళ్ళికి ముందే ఒక పని పూర్తి చేసేసి ఔరా అనిపించింది. ఇక సమంత నటిస్తున్న మరో సినిమా మహానటి సెట్స్ మీదుంది. అలాగే రాజుగారి గది 2 లో కూడా సమంత పార్ట్ షూట్ పూర్తయినట్లుగా చెబుతున్నారు.. మొత్తానికి పెళ్లి టైం కి కాస్త టెన్షన్ తగ్గించుకుని కూల్ గానే పెళ్లిపీటలెక్కబోతుందన్నమాట ఈ భామ.

Samantha Full Free For Marriage :

Samantha Finished Her Commitments before Marriage
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs