Advertisement
Google Ads BL

చేజేతులా కెరీర్‌ని నాశనం చేసుకుంటోంది!


యధా రాజా.. తథా ప్రజ అన్నట్లుగా ఎవరి పెంపకంలో పెరిగితే వారి అలవాట్లే పిల్లలకు కూడా వస్తాయి. ఇక సారిక హాసన్‌కి కమల్‌హాసన్‌కి కలిసి శృతిహాసన్‌, అక్షరహాసన్‌లు పుట్టినప్పటికీ తల్లి పెంపకంలో కాకుండా తండ్రి కమల్‌హాసన్‌ పెంపకంలో పెరిగారు. ఇక కమల్‌హాసన్‌ అంటే కొత్తగా చెప్పాల్సిన పనిలేదు. సహజీవనం నుంచి అన్ని విషయాలలోనూ ఆయన లైఫ్‌స్టైల్‌ పీక్స్‌లో ఉంటుంది. ఇక ఆయన పెద్దకూతురు శృతిహాసన్‌ కూడా ఇప్పుడు అదే బాటలో నడుస్తూ బంగారంవంటి కెరీర్‌ని నాశనం చేసుకుంటోంది. 

Advertisement
CJ Advs

ఈమె మొదట సింగర్‌గా, సంగీత దర్శకురాలిగా కూడా మంచి టాలెంట్‌ని చూపించింది. బాలీవుడ్‌, కోలీవుడ్‌, టాలీవుడ్‌లలో స్టార్‌ స్టేటస్‌ని సాధించింది. మొదట్లో ఆమె నటించిన చిత్రాలన్నీ ఫ్లాప్‌లు అవుతూ ఐరన్‌లెగ్‌ అనిపించుకుంది. కానీ 'గబ్బర్‌సింగ్‌'తో స్టార్‌గా అవతరించింది. ఆ తర్వాత వరుసగా స్టార్‌ హీరోలతో కలిసి నటించి స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. కాగా ఆమె కొంతకాలంగా ఓ విదేశీయుడితో సహజీవనం చేస్తోంది. బాగా మద్యానికి అలవాటు పడి అసలు తన వంటిపై శ్రద్దపెట్టడమే మానేసింది. దాంతో ఈ భామని చూస్తే ఇక ఫేడవుట్‌ అయినట్లేనని సన్నిహితులు అంటున్నారు. 'కాటమరాయుడు' చిత్రంలో నటించినప్పుడు కూడా ఈ అమ్మడి లుక్‌పై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఇక తన ప్రియుడి ద్యాసలో పడటం, తండ్రి కూడా నీ జీవితాన్ని నీ ఇష్టం వచ్చినట్లు జీవించు అని సలహా ఇవ్వడంతో ప్రియుడి మత్తులో పడి సహజీవనం చేస్తోంది. ఇక ఈ అమ్మడు మరలా పూర్వపు గ్లామర్‌ని పొందడం అసాధ్యమేనంటున్నారు. ఏ సినిమా కూడా ఒప్పుకోవడం లేదు. 

'సంఘమిత్ర'లో చాన్స్‌ వచ్చినా మొదట ఓకే చెప్పి తర్వాత నో చెప్పి ప్రాజెక్ట్‌ నుంచి తప్పుకుంది. దీంతో ఈ చిత్రమే ఆగిపోయింది. ఇక మరోపక్క కమల్‌ రాజకీయాలలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దాంతో సామాజిక సమస్యలపై, అంశాలపై మంచి పరిజ్ఞానం ఉండాలి. దాంతో ఆమె పొలిటికల్‌గా కమల్‌కి సహాయం చేస్తూ ఆమె కూడా సినిమాలపై దృష్టి పెట్టదలుచుకోవడం లేదు. మరోవైపు కమల్‌ 'శభాష్‌నాయుడు, విశ్వరూపం2, మరుదనాయగం, భారతీయుడు2' వంటి వాటిని పక్కనపెట్టి కమల్‌ కూడా రాజకీయాలోకి వస్తూ సినిమాలను వదులుకునే పరిస్థితి ఉంది. ఇలా ఈ తండ్రి, ఇద్దరు కూతుర్లు.. ముగ్గురు సినిమాలకు దూరంగా జరిగే పరిస్థితి ఉందని కోలీవుడ్‌ వర్గాలు అంటున్నాయి. 

Shruti Haasan walks out From Movies:

Shruti haasan Sensational Decision on Movies
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs