Advertisement
Google Ads BL

'లక్ష్మీస్ ఎన్టీఆర్' లుక్- వర్మతో మాటలా?


ఎన్టీఆర్ బయోపిక్ రామ్ గోపాల్ వర్మ కల. ఆ కల చెదిరిపోవడంతో ఇపుడు లక్ష్మి పార్వతి - ఎన్టీఆర్ ల జీవితాన్ని హైలెట్ చేస్తూ లక్ష్మీస్ ఎన్టీఆర్ అనే చిత్రాన్ని తియ్యబోతున్నట్టుగా అధికారికంగా అనౌన్స్ చేశాడు. ఇక వర్మ అలా లైన్ లోకి వచ్చాడో లేదో ఇలా రచ్చ స్టార్ట్ అయ్యింది. రచ్చ స్టార్ట్ చెయ్యడమే రామ్ గోపాల్ వర్మ అంతిమ లక్ష్యం. వర్మ అనుకున్నదే జరిగింది. ఆయన లక్ష్మీస్ ఎన్టీఆర్ ప్రకటించగానే టిడిపి గుండెల్లో అగ్గి రాజుకుంది. వర్మ అంతు చూస్తామంటూ బయలుదేరారు. కానీ వర్మ ఎవరికీ తలవంచడు. ఆయన అనుకున్నదే చేస్తాడు. ఇక లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో లక్ష్మి పార్వతి సీనియర్ ఎన్టీఆర్ జీవితంలోకి ఎలా ప్రవేశించింది. లక్ష్మి పార్వతితో ఎన్టీఆర్ ఎలా ఉండేవారు. లక్ష్మి పార్వతిని పెళ్లి చేసుకున్నాక ఎన్టీఆర్ రాజకీయాల్లో ఎలా కొనసాగాడు. అసలు లక్ష్మి పార్వతిలో ఏం చూసి ఆయన మోహితుడయ్యాడు అనే విషయాలను తెర మీద చూపిస్తానని ప్రకటించాడు. ఇక లక్ష్మి పార్వతి కూడా ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కడానికి ఎన్టీఆర్ భార్యగా తన అనుమతి చాలని... ఎన్టీఆర్ కొడుకుల అనుమతి అక్కర్లేదంటూ వర్మ, లక్ష్మీస్ ఎన్టీఆర్ తియ్యడానికి ఫుల్ రైట్స్ ఇచ్చేసింది.

Advertisement
CJ Advs

అసలు ఆవిడ అనుమతి ఇవ్వకపోయినా వర్మ అనుకున్నది చేసేస్తాడు. అది వేరే విషయం. ఇక రామ్ గోపాల్ వర్మ ఇలా మీడియాలో హడావిడి చెయ్యడం.... ఆ తర్వాత సైలెంట్ అవ్వడం అలవాటేలే... ఆ... ఈ లక్ష్మీస్ ఎన్టీఆర్ తెరకెక్కేనా అని అనుకున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ అప్పుడు కూడా తనకి తానే  దర్శకుడిగా ప్రకటించుకున్న వర్మ అప్పుడు ఎన్టీఆర్ మీద ఒక పాటను కూడా విడుదల చేశాడు. ఆ పాట సోషల్ మాధ్యమాల్లో తెగ హల్చల్ చేసింది. అయితే ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ కి సంబందించిన ఒక ఫస్ట్ లుక్ పోస్టర్ ని వర్మ తన ఫేస్ బుక్ పేజీ లో పోస్ట్ చేశాడు. లక్ష్మీస్ ఎన్టీఆర్ పోస్టర్ లో ఏముందో తెలుసా.. ఒక అమ్మాయి వెనుకవైపుగా చీర కట్టులో చెప్పులు విడిచి గడప దాటి కుడి కాలు ఇంట్లోకి పెడుతున్న దృశ్యంతోపాటే... ఇంటిలోపల ఒక వ్యక్తి(ఎన్టీఆర్) కుర్చీలో కూర్చొని  చూస్తూ ఉంటాడు. మరి ఆ పోస్టర్ లో ఎన్టీఆర్ అనే అక్షరాలు పసుపు పచ్చగా ఉంటే లక్ష్మీస్ అనే పదాలు మాత్రం ఎర్రటి రంగులో ఆసక్తి కరంగా ఉన్నాయి. అలాగే టైటిల్ కింద ఇది రామ్ గోపాల్ చిత్రమని కూడా రాసుంది. 

మరి ఈ పోస్టర్ చూస్తుంటే కాంట్రవర్సీ కింగ్ రామ్ గోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రంపై బాగా సీరియస్ గా వున్నట్లే కనబడుతుంది. మరి నటీనటుల వివరాలు వెల్లడించకుండా ఇలా లక్ష్మీస్ ఎన్టీఆర్ పోస్టర్ విడుదల చెయ్యడం వెనుక వర్మ స్టాటజీ ఏమిటో ఎవరికి అంతు  పట్టడం లేదు. కాకపోతే వర్మ మాత్రం లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరకెక్కించి మళ్ళీ రచ్చకి శ్రీకారం చుడుతున్నాడనిపిస్తుంది. 

Lakshmi's NTR First Look Generates Curiosity:

Lakshmi's NTR First Look Released by RGV
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs