Advertisement
Google Ads BL

స్పైడర్ కి 3.5 రేటింగ్ ఇచ్చాడు..!


మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్న స్పైడర్ సినిమా మరికొద్దిగంటల్లోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. అంచనాలు విపరీతంగా వున్న స్పైడర్ సినిమా ఎలా ఉండబోతుంది అనే దానికి స్పైడర్ ఇంటర్వూస్ లో మహేష్, మురుగదాస్ కాస్త క్లారిటీ ఇస్తున్నా ఆ సినిమా మీద ఆసక్తి గంటగంటకు పెరిగిపోతుంది ప్రేక్షకుల్లో. తెలుగు, తమిళంలో ఒకే రోజు విడుదలవుతున్న ఈ సినిమాతో మహేష్ తమిళనాట అడుగెట్టబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన స్పైడర్ టీజర్స్, ట్రైలర్, సాంగ్స్ సినిమా మీద మంచి అంచనాలు పెంచేయగా... ఇప్పుడు దుబాయ్ రివ్యూ మరింత పెంచేసింది.

Advertisement
CJ Advs

సెన్సార్‌బోర్డ్ మెంబర్, ఏషియన్ మూవీస్ మార్కెటింగ్ ఎక్స్‌పర్ట్, క్రిటిక్ అయినా ఉమైర్ సంధు.. స్పైడర్‌ సినిమా ఎలా వుందో చెప్పేసి స్పైడర్ మీద ప్రేక్షకుల్లో ఉత్కంఠత మరింత పెంచేశాడు. స్పైడర్ తో మహేష్ బాబు అభిమానులు ఈ దసరా పండగ పదింతలు విజయంతో పండగ చేసుకుంటారని.... యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన స్పైడర్ కథ, కథనం.. ప్రేక్షకులను ఆధ్యంతం ఆకట్టుకుంటాయంటున్నాడు. సమాజానికి ఏదో ఒకటి చేయాలనుకునే మహేష్... సమాజానికి హానికరంగా మారిన ఓ విలన్‌ను అంతమొందించే పాత్రలో మహేష్ సూపర్ గా నటించాడని అంటున్నాడు ఉమర్. కంటికి కనిపించకుండా విలన్ చేస్తున్న ఘోరాలకు అడ్డుకట్ట వేస్తూనే.... ఆ విలన్‌ ఎవరో కనిపెట్టడం కోసం మహేష్ వేసే ఎత్తులు... సినిమాలో వచ్చే ట్విస్ట్ లు సినిమా మొత్తం మీద ఆసక్తిని పెంచేస్తాయంటున్నాడు. ఈ సినిమా మొత్తంలో క్లైమాక్స్ బెస్ట్ పార్ట్ అంటున్నాడు ఈ క్రిటిక్.

ఇక స్పైడర్ లో మహేశ్ అద్భుత నటన కనబర్చాడని... అలాగే విలన్‌గా ఎస్‌జే సూర్య పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని...  హీరోయిన్  రకుల్ ప్రీత్‌సింగ్ కూడా తన పాత్రకు న్యాయం చేసిందని చెప్పిన ఉమర్ స్పైడర్ కి తానిచ్చే రేటింగ్ 3.5/5 అంటూ ట్వీట్ చేశాడు.

Umair Sandhu‏ Spyder Rating:

Spyder Movie First Review by Umair Sandhu 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs