Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ దమ్ము తెలియాలంటే అదుండాలి..!


జై లవ కుశ చిత్రంలో పోసాని నటన మెచ్చుకోదగినదిగా ఉంది. జై, లవ, కుశ ల మేనమామగా పోసాని నటన సూపర్. ఇద్దరు పిల్లల్ని అంటే లవ, కుశ లను  బాగా చూసుకుని నత్తి వంటి అంగవైకల్యం ఉన్న ఒక్క పిల్లాడు జై ని గేలి చెయ్యడం.... ఆ అవమానాలు పొందిన కుర్రాడు జై  పెద్దయ్యాక పోసానిని తన సంస్థానంలో దోమలు చంపడానికి పెట్టుకుని మేనమామ మీద రివేంజ్ తీర్చుకోవడం.... అలా దోమల రాజుగా పోసాని అద్భుతమైన నటన కనబర్చి ప్రశంసలందుకున్నాడు. అదే విషయాన్ని గత రాత్రి అంటే సోమవారం రాత్రి జరిగిన జై లవ కుశ జయోత్సవంలో ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లు చెప్పారు. పోసాని గారు జై లవ కుశ కు ప్రాణమని చెప్పారు.

Advertisement
CJ Advs

అయితే జై లవ కుశ జయోత్సవ సభలో మాట్లాడిన పోసాని మాత్రం ఎన్టీఆర్ సినిమాలో ఉన్నాడు అంటే ఇంకెవరి నటనకు స్కోప్ ఉండదని... ఎన్టీఆర్ సినిమాలో నటించే అవకాశం ఏ ఆర్టిస్ట్ కి ఎన్టీఆర్ ఇవ్వడని...సినిమా మొత్తం ఆయనే కనబడతాడు. అటువంటి నటనతో ఎన్టీఆర్ ఇరగదీస్తాడని... అసలు జ్వరాన్ని కొలవడానికి థర్మామీటర్.. పాల స్వచ్ఛతను కొలవడానికి లాక్టోమీటర్ ఉన్నట్టే యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటనను కొలవడానికి కూడా ఓ పరికరం ఉందన్నారు. అదే ఈస్తటిక్ మీటర్ అన్నారు. తెలుగులో రస హృదయం అన్నారు. రస హృదయం ఉన్నవాడికి ఎన్టీఆర్ ఎంత దమ్మున్నోడు అనే విషయం తెలుస్తుంది అన్నాడు.

అంతేకాదు ఆయన పక్కన నటించాలంటే ఎంతో కష్టపడాలని... ఎన్టీఆర్ తో నేను రెండు సినిమాలే చేశాను. ఒకటి టెంపర్.. అందులో ఎన్టీఆర్ పక్కన వుండే కానిస్టేబుల్ పాత్ర చేసాను. ఆ సినిమాలో నటించేటప్పుడు ముందే డైలాగ్స్ అన్ని బట్టి పట్టి అప్పుడు ఆ సన్నివేశాల్లో యాక్ట్ చేసేవాడిని. ఎందుకంటే ఎన్టీఆర్ ముందు తేలిపోకూడదు కదా అని. ఇప్పుడు జై లవకుశ విషయంలోనూ అదే చేశా. ముందే డైలాగ్స్ అన్ని చదువుకుని అప్పుడు నటించేవాడిని. ఆయనతో నటించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఇక విలన్ గా సీనియర్ ఎన్టీఆర్ ఎలా సక్సెస్ అయ్యారో... ఇప్పుడు జై లవ కుశతో జూనియర్ ఎన్టీఆర్ కూడా అలాగే విలన్ గా ఇరగదీశాడని చెప్పాడు. 

Posani Krishna Murali Praises NTR at Jai Lava Kusa Success Meet:

Posani Krishna Murali Speech at Jai Lava Kusa Success Meet
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs