Advertisement
Google Ads BL

పిల్లలెప్పుడు అంటే.. మెగాస్టార్‌ కోడలు ఇలా అంది!


మెగాస్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న సమయంలో చిరంజీవి రాజకీయాలలోకి వెళ్లి తన కుమారుడు మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ని తెలుగు తెరకు పరిచయం చేశాడు. ఈ మెగాస్టార్‌ తనయుడు తన రెండో చిత్రం 'మగధీర'తోనే ఇండస్ట్రీ హిట్‌నిచ్చి తండ్రికి తగ్గ తనయునిగా మెగాభిమానులను ఆనందపరుస్తున్నాడు. ఇక ఈ మెగాపవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ ఐదేళ్ల కిందట ఉపాసనని పెళ్లాడాడు. నాటి నుంచి రామ్‌చరణ్‌ దంపతులతో పాటు చిరంజీవికి కూడా బుల్లి మెగాస్టార్‌ ఎప్పుడు? అదేనండీ.. రామ్‌చరణ్‌ తండ్రి ఎప్పుడు కాబోతున్నాడు? అనే ప్రశ్నలే ఎదురవుతున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి మాత్రం ఆ విషయాన్ని వారినే అడగాలని చెప్పాడు. 

Advertisement
CJ Advs

ఇక ఇటీవల రామ్‌చరణ్‌ దంపతులను పిల్లలు ఎప్పుడు అని అడిగితే తాము ఇంకా చిన్నపిల్లలమేనని, బ్యాచ్‌లర్‌ లైఫ్‌ని ఎంజాయ్‌ చేస్తున్నట్లు పెళ్లి తర్వాత వెంటనే పిల్లలను కనకుండా ప్రేమ పక్షుల్లా విహరిస్తున్నామనే అర్దం వచ్చేలా చెప్పుకొచ్చారు. తాజాగా మాత్రం రామ్‌చరణ్‌ భార్య ఉపాసన ఈ విషయంలో నేరుగా పాయింట్‌లోకి వచ్చింది. పిల్లల్ని కనడం అనేది 20ఏళ్ల ప్రాజెక్ట్‌. పిల్లలని ఎప్పుడు కనాలో మాకు తెలుసు. తమ పిల్లలకు 20ఏళ్లు వచ్చేసరికి మేము గర్వంగా ఫీలయ్యేలా ఉండాలి. రామ్‌చరణ్‌కి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఆయన చాలా కూల్‌. ఏ నిర్ణయమైనా ఇద్దరం కలిసి ఆలోచించి తీసుకుంటాం. నేను ఆఫీస్‌ నుంచి పని ముగించుకుని వచ్చేసరికి ఆయన నన్ను ఎంతో జాగ్రత్తగా చూసుకుంటాడు. ఆయన స్వీట్‌ పర్సన్‌..అంటూ చెప్పింది. 

మరి మెగాపవర్‌స్టార్‌ మెగాస్టార్‌కి తండ్రికి తగ్గ తనయునిగా పేరు తెచ్చుకుంటే.. రామ్‌చరణ్‌ పుత్రుడిని కని, మెగాస్టార్‌కి తాతకి తగ్గ మనవడు అనిపించుకునేలా చేయాలని మెగాభిమానులు ఆశ. చూద్దాం.. ఈ 20ఏళ్ల ప్రాజెక్ట్‌ ఎప్పుడు సాకారం అవుతుందో....?

Upasana says kids are 20 project:

Aren’t they ready to turn parents? Speaking about this in a recent interview, Upasana opined,  Children are a 20-year project.
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs