Advertisement
Google Ads BL

రాజమౌళి రెండు రకాలుగా సక్సెస్..!


రాజమౌళి మంచి దర్శకుడే కాదు.. మంచి వక్త కూడా. ఆయన ఏ వేదికనెక్కినా తనదైన శైలిలో పంచ్‌లు విసురుతూ మాట్లాడుతుంటాడు. అంతే కాదు ఆయన తెలుగులోనే కాదు తమిళం, ఇంగ్లీషు వంటి భాషల్లో కూడా అదిరిపోయే స్పీచ్‌లు ఇస్తాడు. ఇక బాహుబలి తర్వాత దేశ విదేశాలలో కూడా గుర్తింపు తెచ్చుకున్న రాజమౌళిని తాజాగా కర్ణాటకలోని మణిపాల్‌ యూనివర్శిటీకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ఆయనకు ఓస్టార్‌కి ఇచ్చినట్లుగా బ్రహ్మరథం పట్టారు. ఇక పలువురు ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఇక రాజమౌళి తనను ఈ యూనివర్శిటీకి ఎందుకు పిలిచారో అర్ధం కావడం లేదంటూ తన ప్రసంగం ప్రారంభించారు. 

Advertisement
CJ Advs

విద్యార్ధులు సెల్ఫీలు దిగుతుంటే, నాతో సెల్ఫీలు దిగడానికే పిలిచారా? నాతో సెల్ఫీలు దిగి సోషల్‌మీడియాలో అప్‌లోడ్‌ చేస్తే కనీసం 200 లైక్‌లైనా వస్తాయా? అని చమత్కరించాడు. ఇక సక్సెస్‌ అనేది రెండు రకాలని... ఒకటి జీవితంలో సక్సెస్‌.. రెండోది కెరీర్‌లో సక్సెస్‌ అని తెలిపారు. తనకు పెళ్లయిన కొత్తల్లో తన భార్య తనను మంచి భర్త అనేదని, ఇప్పటికీ అదే మాట అంటుందని, కాబట్టి నేను జీవితంలో సక్సెస్‌ అయ్యానని భావిస్తున్నాను. ఇక నేను తీసిన చిత్రాలు బాగా ఆడుతున్నాయి కాబట్టి నేను కెరీర్‌లో కూడా సక్సెస్‌ అయ్యాననే భావిస్తున్నానని, అదృష్టవశాత్తూ తాను రెండు విధాలుగా సక్సెస్‌ అయ్యానని చెప్పాడు. ఇక కథను ఇంట్రస్టింగ్‌గా చెప్పడం, క్యారెక్టర్‌ని ఎలివేట్‌ చేయడంలోనే తన సక్సెస్‌ దాగి ఉందని ఆయన చెప్పుకొచ్చాడు. 

Rajamouli speech at Manipal University :

Rajamouli success in two types
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs