Advertisement
Google Ads BL

మోడీ లేఖపై మహేష్ క్లారిటీ !


స్వచ్చభారత్‌కి ప్రమోషన్‌ కలిపించే పనిలో భాగంగా దక్షిణాదిన ఉన్న సెలబ్రిటీలకు ప్రధాని నరేంద్రమోదీ స్వయంగా లేఖలు రాసిన వార్తలు వారం రోజుల నుంచి మీడియాలో వస్తున్నాయి. ఆల్‌రెడీ తనకు లేఖ వచ్చిందని చెప్పిన రజనీకాంత్‌ దానికి సమాధానం కూడా ఇచ్చారు. ఇక టాలీవుడ్‌లో ఈ లేఖ రాజమౌళికి కూడా వచ్చింది. ఆయన దానిని ఫొటో తీసి సోషల్‌ మీడియాలో ఉంచడంతో పాటు మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ, ఆ లేఖకు మరింత ప్రాచుర్యం కలిపించాడు. ఈ లేఖ మహేష్‌బాబుకి కూడా వచ్చిందని, కానీ గత ఎన్నికల్లో బిజెపి తరపున ప్రచారం చేసిన జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌కు మాత్రం మోదీ లేఖ రాయలేదని పవన్‌ అభిమానులు కోపంగా వున్నట్లుగా వార్తలు వినిపించాయి. 

Advertisement
CJ Advs

ఇక 'స్పైడర్‌' ప్రమోషన్‌లో భాగంగా మహేష్‌బాబును మీకు మోదీ లేఖ రాశారా? అని అడిగితే, మోదీనా, నాకా, లేఖ రాయడమా? లేదు. అదంతా ఉత్తుత్తి ప్రచారమని తేల్చేశాడు. ఇక రాజకీయాల గురించి అడిగితే మరోసారి నమస్కారం పెట్టేసి, నాకు రాజకీయాలు పడవు. కాకపోతే బయట ఏమి జరుగుతోంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను. నాకు రాజకీయాలకు చాలా దూరం. ఇక నేను దత్తత తీసుకున్న బుర్రిపాలెం, సిద్దాపురం గ్రామాల అభివృద్ది విషయాలను నమ్రతా చూసుకుంటోంది. అవసరమైతే ఈ గ్రామాలను నేను కూడా సందర్శిస్తా. ఈ గ్రామాలను మరింత వృద్దిలోకి తేవడమే తన లక్ష్యమని తెలిపాడు. 

Mahesh Babu Clarity on Narendra Modi Swachh Bharat Letter:

Super Star Mahesh Babu About Modi Letter
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs