Advertisement
Google Ads BL

ఎన్టీఆర్ తెరపై ఉండగా మరొకరా..! ఎంతమాట?


నిన్నటితరం హీరోలు ఎంతో బిజీగా ఉండి తల్లిదండ్రులను, తమ సొంత ఫ్యామిలీ, పిల్లలను కూడా పట్టించుకోకుండా వృత్తే దైవంగా బతికేవారు. కానీ జనరేషన్‌ మారింది. నేటి జనరేషన్‌ స్టార్స్‌ ఎంత బిజీగా ఉన్నా తమ ఫ్యామిలీలకు, తల్లిదండ్రులకు, పిల్లలకు కూడా తగినంత సమయం కేటాయిస్తూ ఫ్యామిలీని, సినిమాలను సమన్వయం చేసుకుంటూ వెళ్తున్నారు. అలాంటి వారిలో యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఒకడు. 

Advertisement
CJ Advs

వరుస చిత్రాలు, మధ్యలో నవరత్న హెయిర్‌ ఆయిల్‌ వంటి సంస్థలకు బ్రాండ్‌ అంబాసిడింగ్‌, మరోపక్క బుల్లితెరపై 'బిగ్‌బాస్‌'షో మద్య కూడా తన ఫ్యామిలీ, మరీముఖ్యంగా తన తల్లి, భార్య, పిల్లాడు అభయ్‌రామ్‌లను మిస్‌కావడం లేదు. తాజాగా ఆయన నవరత్న హెయిర్‌ ఆయిల్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌గా ప్రమోషన్‌ నిమిత్తం జరిగిన కార్యక్రమంలో ఆయనకు బిగ్‌బాస్‌కి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. అయితే వాటిని ఎన్టీఆర్ తన వాక్చతుర్యంతో తన ఫ్యామిలీకి ఆపాదించి నవ్వుల పువ్వులు పూయించారు. 

మీ అమ్మగారికి బిగ్‌బాస్‌లో ఏ పార్టిసిపెంట్‌ అంటే ఇష్టం? అన్న ప్రశ్నకు ఆయన సమాధానం ఇస్తూ 'నేను తెరపై కనిపిస్తుంటే మా అమ్మకు నన్ను దాటి చూపు ఎక్కడికీ వెళ్లదు. నా భార్య ప్రణతి కూడా అలాగే తయారైంది. నన్ను తప్ప మరెవ్వరినీ చూడదు...' అని నవ్వుల వర్షం కురిపించేలా తన ఫ్యామిలీని మాటల్లోకి తెస్తూ చెప్పాడు. ఇక తన జీవితంలో ఇలాంటి ఇద్దరు మహిళలు ఉండటం తన అదృష్టమని అన్నాడు. 

మరి బిగ్‌బాస్‌ రెండో సీజన్‌కి కూడా మీరే హోస్ట్‌గా ఉంటారా? అన్న ప్రశ్నకు.. సమాధానం చెప్పే సమయం, సందర్భం ఇది కాదని తప్పించుకున్నాడు. మొత్తానికి ఈమధ్య కాలంలో ఎన్టీఆర్‌ ఏ ప్రశ్న వేసినా దానికి తన ఫ్యామిలీతో ఎక్కువగా లింక్‌పెట్టి మాట్లాడుతున్నాడు. దాన్ని బట్టి ఫ్యామిలీతో ఆయనకున్న అనుబంధం, ఆప్యాయత అర్ధమవుతోంది. 

Young Tiger NTR About His Family:

Young Tiger NTR Simple Answers To Media at Navratna Oil Ad Shooting
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs