స్టార్‌హీరోలను పొగడటంలోనే మన సినిమాలలోని ఇతర టెక్నీషియన్స్, నటీనటుల జీవితాలు తెల్లారిపోతాయి. ఇక ఇటీవల పోసాని మాట్లాడుతూ.. పవన్‌లో మంచి లక్షణాలు ఉన్నాయి కానీ ఆయన రాజకీయాలకు సరిపడడు. గతంలో చంద్రబాబు ఎంతో గొప్పగా తన వద్దకు ఏ సమస్య వచ్చినా డేరింగ్‌గా నిర్ణయాలు తీసుకున్నాడు. కానీ ఇప్పుడు మాత్రం ఆయన ఏ పని చేస్తే ఎవరి ఓట్లు వస్తాయి? ఏ నిర్ణయం తీసుకుంటే ఎవరి ఓట్లు పోతాయి? అనే భయంతో ఉన్నాడని నిజాన్ని నిష్కర్షగా చెప్పాడు. ఇక తాను పవన్ సీటు ఇచ్చినా వద్దంటానని, ఈసారికి జగన్‌కి ఓటేస్తానని, ఆయన పరిపాలన చూసిన తర్వాత రెండోసారి వేయాలా? వద్దా? అనేది నిర్ణయించుకుంటానని చెప్పాడు. ఇది పచ్చి నిజం.
కానీ తెలుగులో భజనపరులైన రైటర్లలో ఒకడిగా ఎవరినైనా ఆకాశానికి ఎత్తేసేలా మాట్లాడే వారిలో ఒకప్పటి స్టార్ రైటర్ చిన్నికృష్ణని చెప్పుకోవచ్చు. ఈయన తమిళంలో 'నరసింహ' కే గాక 'ఇంద్ర, నరసింహనాయుడు, గంగోత్రి, బద్రినాథ్' వంటి చిత్రాలకు కథను అందించాడు. ఈయన కోరిక ఏమిటంటే చిరంజీవిని లేదా పవన్‌ని డైరెక్ట్ చేయడం మాత్రమే. ఇక విషయానికి వస్తే ఈయన తాజాగా పవన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశాడు. అలాగని వాస్తవాలు మాట్లాడాడని భ్రమపడవద్దు. ఏకంగా పవన్‌ని మదర్‌థెరిస్సా, గౌతమబుద్దుడితో పోల్చోడు? వినడానికి ఈ మాటలు చివరకు పవన్, చిరులకే కాదు.. వారి అభిమానులకు కూడా కాస్త ఓవర్‌గా అనిపిస్తాయి. ఇంతేకాదు చిన్నికృష్ణ మాత్రం మరింత రెచ్చిపోయాడు.
భారత జాతిలో పవన్ ఓ అరుదైన వ్యక్తి. ఎంతటి క్రూరమనస్సు ఉన్న వారిని కూడా పవన్ బాధించడు. ఏదో ఒకరోజు పవన్ దేశానికి ఐకాన్ పొలిటీషియన్‌గా అవుతాడు. దీనిని ఆపడం ఎవరి వల్లా కాదని చెప్పాడు. ఈ మాటలు వినడానికే కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయి. చిరు, పవన్‌లు కూడా మధర్‌ధెరిస్సా బాటలో నడుస్తామని చెబుతారే గానీ వారితో తాము సమానమని చెప్పలేరు. కలలో కూడా ఊహించలేరు. మొత్తానికి చిన్నికృష్ణ, బండ్ల గణేష్ వంటి భజనపరులు పవన్ మీద మంచి అభిప్రాయం ఉండే వారిలో కూడా ఇలాంటి అతిశయోక్తి మాటలను అంటూ ఆయనకు చెడ్డపేరు అంటిస్తున్నారు.
ఇకనైనా అలాంటి వారి మాటలను వినకపోవడం, చెవులకు ఎక్కించుకోకుండా ఉండటం పవన్‌కి, ఆయన అభిమానులకు మంచిది. మంచిని మంచి అని చెప్పుకుందాం. తప్పుని తప్పు అని ఒప్పుకుందాం.. అంతేగానీ ఇలాంటి భజనపరులకు, అనసరంగా పవన్ పేరుతో సెలబ్రిటీలు కావాలనుకునే కత్తి మహేష్ వంటి విమర్శకులకు మౌనంగా ఉండటం మించి మందే లేదని చెప్పవచ్చు. పవన్ పేరుతో సెలబ్రిటీలు, చాన్స్‌ల కోసం ఎదురు చూసే వారిని దూరంగా పెట్టడం ఇప్పుడు చాలా అవసరం.