Advertisement
Google Ads BL

కేథరిన్ పై 'అర్జున్‌రెడ్డి' యాటిట్యూడ్‌..!


'అర్జున్‌రెడ్డి' చిత్రంతో రాత్రికి రాత్రి ఓవర్‌నైట్‌ స్టార్‌గా మారిపోయి యూత్‌కి ఐకాన్‌ అయిపోయాడు యంగ్‌హీరో విజయ్‌ దేవరకొండ. ఇక ఈ చిత్రంలోని ఆయన యాటిట్యూడ్‌ యువతను భలే ఆకట్టుకుంది. ఇక ఈయన తాజాగా రియల్‌లైఫ్‌లో కూడా తన యాటిట్యూడ్‌ని చూపించి చూపరులను, వీక్షకులను ముక్కున వేలేసుకునేలా చేశాడు. సాధారణంగా సినిమా వారికి, అందునా నేటి తరం యువత ఆలోచనాధోరణి విభిన్నంగా ఉంటోంది. ఇది సినిమా వాళ్లలో కాస్త ఎక్కువ మోతాదులోనే కనిపిస్తుంది. వారికి ముద్దులు, కౌగిలింతలు సినిమాలలోనే కాదు.. రియల్‌లైఫ్‌లో కూడా కామన్‌. వాటిని వారు పెద్దగా పట్టించుకోరు. కానీ వారి ఈ వేషాలను ప్రత్యక్షంగా చూసే వారు మాత్రం ముక్కున వేలేసుకుంటారు. మరికొందరు యువత ఇదే ధోరణిని ఫాలో అవుతూ, సినిమా వారి జీవితాలను తాము కూడా అనుకరించే ప్రయత్నం చేస్తూ ఉంటారు. 

Advertisement
CJ Advs

తాజాగా విజయ్‌ దేవరకొండ, హీరోయిన్‌ కేథరిన్‌థ్రెస్సాలు ఓ షాపింగ్‌మాల్‌ ప్రారంభోత్సవానికి వచ్చారు. వారు ఆ షాపింగ్‌మాల్‌ ప్రకటన కోసం పనిచేస్తున్నారు. వీరిద్దరు కలిసి నటించింది లేదు. విశ్వసనీయ సమాచారం ప్రకారం వీరిద్దరికి పెద్దగా పరిచయం కూడా లేదు. కానీ వీరిద్దరు ఒకరినొకరు కలుసుకోగానే గట్టిగా కౌగిలించుకున్నారు. ఈ సమయంలో కేథరిన్‌థ్రెస్సా పట్టుచీర కట్టుకుని ఉండగా, విజయ్‌ దేవరకొండ నార్మల్స్‌ని ధరించి ఉన్నాడు. 

ఎంతో తెలిసిన వారిలా, ఎంతో పరిచయం ఉన్న క్లోజ్‌ ఫ్రెండ్స్‌గా వీరిద్దరు హగ్‌చేసుకోవడాన్ని లైవ్‌లో చూసిన వీక్షకులు, జనాలు ఆశ్చర్యపోయి తర్వాత తేరుకున్నారు. కాగా విజయ్‌ దేవరకొండ 'అర్జున్‌రెడ్డి' యాటిట్యూడ్‌ని ఈ హగ్‌ ద్వారా చూపించాడని కొందరు సెటైర్లు వేస్తున్నారు. ఇక విజయ్‌ 'పెళ్లిచూపులు', 'అర్జున్‌రెడ్డి' చిత్రాలతో స్టార్‌గా మారగా, కేధరిన్‌ అన్ని ఉన్నా కూడా కేవలం సెకండ్‌ హీరోయిన్‌ లేదా ఐటం సాంగ్స్‌కే పరిమితమవుతోంది. ఈమె తెలుగుతో పాటు తమిళంలో కూడా అందాలను ఆరబోస్తున్నా స్టార్‌డమ్‌ రావడం లేదు. మరి విజయ్‌ దేవరకొండ తాను త్వరలో ఒప్పుకోబోయే చిత్రాలలో ఈమెకి ఏమైనా చాన్స్‌ ఇస్తాడేమో వేచిచూడాల్సివుంది...! 

Catherine and Vijay Devarakonda Hug Creates Sensation:

Vijay Devarakonda Romantic Tight Hug with Catherine Tresa
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs