Advertisement
Google Ads BL

'జైలవకుశ'లు చిరుని టచ్ చేయలేకపోయారు!


టాలీవుడ్‌లో ఇప్పటికీ ఎప్పటికీ మెగాస్టారే నెంబర్‌వన్‌ అని ట్రేడ్‌ విశ్లేషకులు తేల్చిచెబుతున్నారు. ఆయన రాజకీయాలలో అందరివాడు కాలేక కొందరివాడిగా మిగిలిపోయాడు. కానీ అంతకు ముందు నెంబర్‌ వన్‌ నుంచి నెంబర్‌ టెన్‌ వరకు అన్ని చిరంజీవినే అని నాగార్జున, మహేష్, సుమన్‌ వంటి హీరోలు ఆయనకి ఆనాడే కితాబునిచ్చారు. మరలా సినిమాలలోకి తన 150వ ప్రతిష్టాత్మక చిత్రం 'ఖైదీనెంబర్‌ 150' ద్వారా ఎంట్రీ ఇచ్చాడు. కానీ ఆ సినిమా విడుదలకు ముందు ఎందరిలోనో ఎన్నో అనుమానాలున్నాయి. రీఎంట్రీ టైంలో చిరంజీవి సినిమాలలో కూడా రాజకీయాలలో మాదిరి కొందరివాడుగా మిగిలిపోతాడా? లేక అందరివాడు అనిపించుకుంటాడా? అనేది సందేహమే. కానీ ఆ అనుమానాలను ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'ఖైదీనెంబర్‌ 150'తో చిరు చెక్‌ పెట్టాడు. 

Advertisement
CJ Advs

'నాన్‌ బాహుబలి' రికార్డులన్నింటినీ తిరగరాశాడు. ఇక ఈ చిత్రం తర్వాత మాస్‌లో మంచి ఫాలోయింగ్‌ ఉన్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ నటిస్తున్న 'జై లవ కుశ' చిత్రమైనా ఖైదీని తుడిచిపెడుతుందని నందమూరి అభిమానులు భావించారు. కానీ 'జై లవ కుశ' కూడా ఖైదీ కలెక్షన్లను టచ్‌ చేయలేకపోయింది. 'జై లవ కుశ' చిత్రం థియేటర్లపరంగా చూసుకుంటే 'ఖైదీ' కంటే ఎక్కువ థియేటర్లలోనే విడుదలైంది. 'జై లవ కుశ' చిత్రం రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి తొలిరోజు 21.81కోట్ల షేర్‌ వసూలు చేసింది. కాగా 'ఖైదీ' చిత్రం తొలిరోజు రెండు తెలుగు రాష్ట్రాలలో 24 కోట్ల షేర్‌ని వసూలు చేయడం విశేషం. దాంతో ఖైదీ రికార్డు ఇంకా పదిలంగా ఉండగా, ఎన్టీఆర్‌ రెండో స్థానంతో సరిపుచ్చుకోవాల్సివచ్చింది. ఒక్క కృష్ణ, సీడెడ్‌లో మాత్రమే బలంగా బేస్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఎన్టీఆర్‌ అప్పర్‌ హ్యాండ్‌ సాధించాడు. మిగిలిన అన్ని ఏరియాలలో మెగాస్టారే మొదటి స్థానంలో ఉన్నాడు. ఓవర్‌సీస్‌లో కూడా అదే పరిస్థితి. ఓవర్‌సీస్‌లో చిరంజీవి ఖైదీ చిత్రం ప్రీమియర్‌ షోల ద్వారా 1.2 మిలియన్లు దాటితే, 'జై లవకుశ' మాత్రం 5లక్షల 89వేల డాలర్లతో సరిపుచ్చుకుంది. ఓవరాల్‌గా చిరంజీవి 35 కోట్లతో నాన్‌ బాహుబలి రికార్డులను తన పేరుతో రాసుకుంటే 'జై లవ కుశ' మాత్రం 29.29కోట్ల షేర్‌ని రాబట్టింది. 

ఇక 'ఖైదీ' చిత్రం కంటే 'జై లవ కుశ' దాదాపు 5కోట్లు తక్కువగా ఉన్నాడు. మరి మెగాస్టార్‌ 'ఖైదీ నెంబర్‌ 150'ని కొడితే మహేష్‌బాబు 'స్పైడర్‌' కొట్టే అవకాశం ఉంది. మురుగదాస్‌-మహేష్‌బాబుల కాంబినేషన్‌ కావడం, ఓవర్‌సీస్‌లో మహేష్‌కి విపరీతమైన క్రేజ్‌ ఉండటం, తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ చిత్రం విడుదల కానుండటం వంటివి ఈ చిత్రానికి బలాన్నిచ్చే అంశాలు. 'స్పైడర్‌' కూడా మిస్‌ అయితే పవన్‌-త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న పీఎస్‌పీకే 25 చిత్రం మీద కూడా అవే నమ్మకాలు ఉన్నాయి. అయితే ఇప్పుడు చిరంజీవి దృష్టంతా తన 'సై..రా.. నరసింహారెడ్డి' ద్వారా 'బాహుబలి' రికార్డులను బద్దలు చేయడం మీదనే ఉంది. ఇంకా చెప్పుకుంటే బాలీవుడ్‌కి 'బాహుబలి' సమయంలో ప్రభాస్‌ కొత్త. కానీ 'సై..రా'కి ముందే చిరు కొన్ని బాలీవుడ్‌ చిత్రాలతో అక్కడి ప్రేక్షకులకు పరిచయం. అయితే 'బాహుబలి'కి అండగా రాజమౌళి ఉండగా, చిరంజీవి నమ్ముకున్న సురేందర్‌రెడ్డి ఈ టార్గెట్‌ని రీచ్‌ చేసేలా చిరుని ప్రజెంట్‌ చేయగలడా? లేదా? అన్నదే ప్రశ్న.

Jai Lava Kusa Missed the Khaidi No 150 Records :

Jai Lava Kusa Not Reached Day 1 Record of Khaidi No 150
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs