ఫిలింనగర్ కల్చరల్ సెంటర్ అధ్యక్షుడుగా డా. కె ఎల్ .నారాయణ
హైదరాబాద్ ఫిలిం నగర్ అధ్యక్షుడుగా డా. కె ఎల్ .నారాయణ ఎన్నికయ్యారు. ఆదివారం నాడు ఎన్నికలు జరిగాయి. అధ్యక్షుడుగా నారాయణ , కార్యదర్శిగా రాజశేఖర్ రెడ్డి, కోశాధికారిగా తుమ్మల రంగరావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా పోస్టులకు ఎన్నికలు జరిగాయి. ఉపాధ్యక్షుడుగా ముళ్ళపూడి మోహన్, సంయుక్త కార్యదర్శిగా హరి ప్రసాద్ , కార్యనిర్వాహక సభ్యులుగా జి . ఆదిశేషగిరి రావు, కాజా సూర్యనారాయణ, శైలజ, నాగ సుష్మ, బాలరాజు, సురేష్ కొండేటి, సదా శివ రెడ్డి, కిషోర్ చౌదరి, పెద్దిరాజు ఎన్నికయ్యారు .
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడుగా డా. కె ఎల్ .నారాయణ మాట్లాడుతూ.. ఫిలిం నగర్ సెంటర్ ఇప్పుడు హైద్రాబాద్ లోనే నెంబర్ వన్ గా చేస్తామని హామీ ఇచ్చారు. కల్చరల్ సెంటర్ లో స్నేహపూర్వక వాతావరణం కల్పిస్తామని, సభ్యుల అభిప్రాయాలకు ప్రాధాన్యంత ఇస్తామని అన్నారు.