Advertisement
Google Ads BL

'సై..రా...నరసింహారెడ్డి' విలనెవరో తెలుసా?


ప్రస్తుతం చిరంజీవి నేషనల్‌ లెవల్లో 'సై..రా...నరసింహారెడ్డి' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రాన్ని దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో విడుదల చేసేందుకు అమితాబ్‌ నుంచి విజయ్‌సేతుపతి దాకా అన్ని భాషల వారిని తీసుకుంటున్నారు. ఇక ఈ చిత్రంలో నయనతారను కూడా ఎంపిక చేశారు. ఇందులో చిరంజీవికి అంటే ఉయ్యాలవాడకి ఇద్దరు హీరోయిన్లు అవసరం. దాంతో నయనతార ఆ హీరోయిన్లలో ఒకరని అందరూ భావించారు. కానీ తాజా సమాచారం ప్రకారం ఇందులో నయనతార పాత్ర చిరంజీవిని ఢీ కొట్టే పాత్ర అని, ఆయనకు శత్రువుగా ఆమె నటిస్తోందని తెలుస్తోంది. 

Advertisement
CJ Advs

విలక్షణ పాత్ర కావడంతోనే నయనతార ఈ చిత్రంలో చేయడానికి అంగీకరించిందనే వార్తలు వస్తున్నాయి. ఇక ఇందులో ప్రగ్యాజైస్వాల్‌ కూడా నటించనుంది. ఈ పాత్ర అమితాబ్‌బచ్చన్‌ కూతురి పాత్ర అని తెలుస్తోంది. మరి నయనది నెగటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్ర అయితే ఇందులో చిరంజీవి సరసన నటించే ఇద్దరు హీరోయిన్లుగా ఎవరిని తీసుకుంటారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇక నయనతార, బాలయ్య 102వ చిత్రంలో కూడా రాయలసీమ ఫ్యాక్షన్‌ లీడర్‌గా 'నరసింహా'లోని రమ్యకృష్ణ నీలాంబరి టైప్‌ పెర్ఫార్మెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించనుందని తెలుస్తోంది. మొత్తానికి నయన మెగాస్టార్‌తో పాటు నందమూరి నటసింహం చిత్రంలో కూడా నెగటివ్‌ షేడ్స్‌ ఉండే పాత్రే అని అందరు అంటున్నారు. ఇదే నిజమైనే ఇంతకంటే ఆసక్తికరంగా మరేది ఉండదు. 

ఇక 'సై..రా' చిత్రానికి మొదట 'అపరిచితుడు, దశావతారం' వంటి చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన రవివర్మన్‌ను పెట్టుకున్నారు. ప్రస్తుతం ఆయన ఈ చిత్రం నుంచి వైదొలిగాడని వార్తలు వస్తున్నాయి. ఆ స్థానంలో చిరంజీవి 150వ చిత్రం 'ఖైదీనెంబర్‌ 150'తో పాటు ప్రస్తుతం సుకుమార్‌, రామ్‌చరణ్‌ల కాంబినేషన్‌లో రూపొందుతున్న 'రంగస్థలం 1985' చిత్రం సినిమాటోగ్రాఫర్‌ అయిన రత్నవేలుకి బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. మరి 'సై..రా' చిత్రం భారీ చిత్రం కావడంతో సినిమా పూర్తయ్యే సరికి ఎన్ని వికెట్లు పడతాయో? అని అంటున్నారు. ఇప్పటికైతే ఒక వికెట్‌ రవివర్మన్‌ రూపంలో పడిన విషయం గ్యారంటీనే అంటున్నారు. 

Nayantara Negative Role in Sye Raa?:

Nayan will play a negative shaded role which challenges Chiranjeevi in the movie Sye Raa. 
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs