Advertisement
Google Ads BL

అంజలి చెల్లెలే ఆరాధ్య..కండీషన్స్ అప్లై..!


రీసెంట్ గా అంజలి చెల్లెలు ఆరాధ్య ఫోటో షూట్ అంటూ ఒక అమ్మాయి ఫోటోలు బయటికి వచ్చాయి. ఆ అమ్మాయి అంటే అంజలి చెల్లెలు అని చెప్పబడే ఆరాధ్య హాట్ హాట్ ఫొటోస్ వెబ్ మీడియాలో, సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అసలు ఈ అమ్మాయి అంజలి చెల్లెలేనా అని అనుమానం వచ్చెలోపె మళ్ళీ ఆరాధ్య ఫొటోస్ అంటూ ఫోటో గ్రాఫర్స్ తీసిన కొన్ని ఫొటోస్ బయటికి రావడం.... వెనువెంటనే అంజలి చెల్లెలు ఆరాధ్య సినిమాల్లోకి అడుగుపెడుతుందంటూ ఆరాధ్య పిఆర్ఓ ఒక ప్రెస్ నోట్ పంపడం జరిగిపోయాయి.

Advertisement
CJ Advs

ఇక ఆ ప్రెస్ నోట్ లో అంజలి చెల్లెలుగా చిన్న‌ప్ప‌టి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. నీ క‌ళ్లు బాగుంటాయి.. సినిమాల్లోకి వెళ్లొచ్చు క‌దా?  అని స‌న్నిహితులు చెప్పేవారు. అక్క అంజ‌లి సినిమాల్లో రాణించింది. తన‌ని స్ఫూర్తిగా తీసుకొని నేను కూడా అడుగుపెట్టా. అక్క తెలుగు చిత్ర‌సీమ‌లో త‌న‌కంటూ ఓ స్థానం సంపాదించుకొంది.  అదృష్టం అనేదానికంటే అక్క ప‌డిన క‌ష్ట‌మే.. త‌న ఉన్న‌తికి కార‌ణం. మా అమ్మ కూడా త‌న‌కి బాగా స‌పోర్ట్ చేసింది. అమ్మ స‌హ‌కారం ఉంటుంద‌న్న ధైర్యంతోనే నేనూ చిత్ర‌సీమ‌లో అడుగుపెట్టా. చిన్న‌ప్పుడే నృత్యం నేర్చుకొన్నా. సినిమాకి ఏమేం కావాలో... వాటిపై శిక్ష‌ణ పొందా. న‌టిగా నాకు పేరొచ్చే ఎలాంటి పాత్ర అయినా చేస్తా. పాత్ర‌కు త‌గ్గ‌ట్టుగా క‌నిపిస్తా. గ్లామ‌రా, న‌ట‌న‌.. అనేదానికంటే మంచి పాత్ర‌లు, మంచి క‌థ‌లే ముఖ్యం. ప్ర‌స్తుతం త‌మిళంలో ఓ చిత్రంలో న‌టిస్తున్న స‌ముద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. తెలుగులోనూ ఓ సినిమా చేస్తున్నా. ఒక‌ట్రెండు సినిమాలు చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉన్నాయి. అంటూ ఆరాధ్య చెప్పడం బట్టి చూస్తే నిజంగా ఆమె అంజలి చెల్లెలు అని అందరూ దాదాపు ఫిక్స్ అయ్యారు.

కానీ శనివారం రాత్రికల్లా హీరోయిన్ అంజలి నాకెవరు చెల్లెల్లు లేరంటూ సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది. ఆరాధ్య.. అంజలి చెల్లెలు అనే వార్తల్లో అసలు నిజం లేదని, అలా వస్తున్న వార్తలన్నీ కేవలం పుకార్లు మాత్రమేనని ట్విట్టర్ ద్వారా హీరోయిన్ అంజలి వెల్లడించింది. అంజలి తన ట్విట్టర్ లో.... అంజలి చెల్లెలు సినిమాల్లోకి వస్తుందని మీడియాలో వస్తున్న వార్తలన్నీ అవాస్తవం. నాకు కేవలం ఒక అక్క మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె పెళ్లిచేసుకొని ఆనందంగా జీవితం గడుపుతోంది... అంటూ అంజలి మేనేజర్ రియాజ్ కే అహ్మద్ పెట్టిన ట్వీట్‌ని రీ ట్వీట్ చేస్తూ తెలిపింది అంజలి.

అయితే హీరోయిన్ అంజలి చెప్పేది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే అంజలినిని ఇండస్ట్రీలోకి తీసుకొచ్చిన ఆమె పిన్ని కూతురే ఈ ఆరాధ్య. అయితే అంజలికి ఆమె పిన్నికి గతంలో గొడవలు వచ్చి విడిపోవడంతో అంజలి ఇప్పుడు ఎవరి అండ లేకుండానే హీరోయిన్ గా కోలీవుడ్, టాలీవుడ్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నాలు చేస్తుంది. అయితే ఇప్పుడు హీరోయిన్ అంజలి పిన్ని కూతురు ఆరాధ్య అన్నమాట. ఆరాధ్య చెప్పింది నిజమే కాని.... ఆరాధ్య కూడా అంజలి అక్క అని చెప్పే కన్నా కజిన్ అని చెబితే క్లారిటీ ఉండేది.

Heroine Anjali Reacts on Her Sister Aradhya Cine Entry:

Aradhya Not Anjali Sister. Anjali Tweeted
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs