Advertisement
Google Ads BL

పార్టీలో కూడా సమంత తగ్గట్లేదు..!


వచ్చే నెల 6 న గోవాలో నాగ చైతన్య - సమంతల పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే పెళ్లి షాపింగ్ లో బిజీగా ఉన్న ఈ జంట మరోపక్క తమ సినిమా షూటింగ్స్ కి కూడా హాజరవుతూ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. ఇక సమంత అయితే పెళ్లి డ్రెస్సులు ఫోటో షూట్స్ అంటూ ఒక పెళ్లి గౌన్ తో ఫోటో షూట్ కూడా చేయించుకున్నట్లుగా సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ చక్కర్లు కొడుతున్నాయి. మరి అది నిజమా కదా అనేది క్లారిటీ లేదుగాని... ఆ పెళ్లి డ్రెస్సులాంటి ఒక డిజైనర్ వెర్ డ్రెస్సుతో సమంత హాట్ హాట్ గా ఫోటోలు కూడా దిగేసింది. ఆ ఫొటోస్ చూసి జనాలంతా సమంత పెళ్లి గౌన్ ని ట్రై చేస్తుందంటూ ఊహించేసుకుంటున్నారు. ఇక ఆ ఫోటో షూట్స్ లో సమంత అందాల ప్రదర్శన మాములుగా లేదు. పెళ్ళికి ఇలాంటి హాట్ డ్రెస్సు సమంత ధరిస్తుందా అంటూ ఒకటే గుసగుసలు. అక్కినేని ఇంటికి  కోడలిగా వెళ్లబోయే సమంత ఇలా చేస్తుందేమిటి చెప్మా... అంటూ అందరూ దీర్ఘాలు తీస్తున్నారు. మరికొందరైతే గ్లామర్ ఫీల్డ్ లో ఉంది కదా పెళ్లి తర్వాత కూడా నటిస్తాను అంటుంది కాబట్టి ఆ మాత్రం హాట్ నెస్ ఉండాలంటున్నారు.

Advertisement
CJ Advs

ఇక తాజాగా సమంత తన స్నేహితులకు ఒక పార్టీ ఇచ్చింది. అయితే ఈ పార్టీ తన పెళ్లి సందర్భంగా ఇచ్చిందని తెలుస్తుంది. ఈ పార్టీలో నాగ చైతన్య, అఖిల్, శిల్పా రెడ్డి, సుమంత్ తదితరులు పాల్గొన్నారు. ఇక ఈ పార్టీలో దిగిన ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. ఆ పార్టీలో అందరూ ఫుల్ ఎంజాయ్ చేశారనే విషయం మాత్రం ఆ ఫొటోస్ ని బట్టే అర్ధమవుతుంది. అయితే ఈ పార్టీ డ్రెస్ లో కూడా సమంత సూపర్ హాట్ గానే కనబడుతుంది. మరి పార్టీస్ అంటే ఇలాగే ఉంటారు. అందులోను ప్రవేట్ పార్టీ అంటే మరీను. హాట్ హాట్ డ్రెస్సులతో అదిరిపోయే ఎంజాయ్ మెంట్ కూడా ఉంటుంది. అసలు పార్టీ కల్చర్ అంటే ఇంతే అంటున్నారు కొందరు. మరి పెళ్లి ఫిక్స్ అయ్యాక ఎక్కువగా గ్లామర్ చూపించేస్తున్న సమంత పెళ్లి తర్వాత ఏమన్నా తగ్గుతుందేమో చూద్దాం.

Samantha Special Party to Her Friends :

Samantha no compromise in exposing
Show comments


LATEST TELUGU NEWS


Advertisement
Google Ad amp 3 CJ Ads

LATEST IN NEWS

POPULAR NEWS

Advertisement
Google Ad amp 3 CJ Ads


LATEST IN GALLERIES

POPULAR GALLERIES

CJ Advs
Advertisement
CJ Advs